‘ఖైదీ’.. పైసా వసూల్ మూవీ..చిరు పేరు చెడగొట్టలేదు

ఖైదీ’ మూవీ రివ్యూ నటీనటులు: కార్తి – నరేన్ కుమార్ – హరీష్ ఉత్తమన్ – హరీష్ పేరడి తదితరులు సంగీతం: సామ్ సి.ఎస్ ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్ నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రభు – రాధామోహన్ రచన – దర్శకత్వం: లోకేష్ కనకరాజ్ ఇంట్రో: యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకం పై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు […]

‘ఖైదీ’.. పైసా వసూల్ మూవీ..చిరు పేరు చెడగొట్టలేదు
Follow us

|

Updated on: Oct 26, 2019 | 4:19 PM

ఖైదీ’ మూవీ రివ్యూ

నటీనటులు: కార్తి – నరేన్ కుమార్ – హరీష్ ఉత్తమన్ – హరీష్ పేరడి తదితరులు సంగీతం: సామ్ సి.ఎస్ ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్ నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రభు – రాధామోహన్ రచన – దర్శకత్వం: లోకేష్ కనకరాజ్

ఇంట్రో:

యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకం పై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ ఆది శంకర్ (హరీష్ ఉత్తమన్) అనే గ్యాంగ్‌స్టర్ తెలుగు రాష్ట్రాల్లోకి అక్రమంగా కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను తీసుకొస్తాడు. చిత్తూరు నుంచి ఆ డ్రగ్స్‌ను మిగిలి ప్రొంతాలకు తరలించాలని ప్లాన్ చేస్తాడు. అయితే, కొంత మంది పోలీసులు ఆ గ్యాంగ్‌లో అండర్ కవర్ ఆఫీసర్లుగా ఉండటంతో ఆ సరుకు మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఎస్పీ ఆఫీసులో దాచిపెడతారు.

ఆ డ్రగ్స్‌ను ఎలాగైనా చేజిక్కుంచుకోవాలని, ఇన్ఫార్మర్లుగా ఉన్న పోలీసులను చంపేయాలని ఆది శంకర్ గ్యాంగ్ ప్లాన్ వేస్తుంది. ఇదే సమయంలో జైలు నుంచి విడుదలైన ఢిల్లీ (కార్తి) అనుకోకుండా పోలీసుల దగ్గర ఇరుక్కుంటాడు. అయితే, ఆ పోలీసులకు ఢిల్లీనే దిక్కవుతాడు. ఖైదీ జీవితాన్ని అనుభవించి బయటికి వచ్చిన ఢిల్లీ.. అసలు పోలీసులకు ఎందుకు సాయం చేశాడు? గ్యాంగ్‌స్టర్స్ నుంచి వాళ్లను ఎలా కాపాడాడు అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్
కథ
కథనం
కార్తి నటన
దర్శకుడి పనితనం
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్
 సెకండ్ హాఫ్ స్లోగా సాగడం
లాజిక్ లేని కొన్ని సన్నివేశాలు
సాంకేతిక వర్గం:
సాంకేతికంగా ఖైదీ ఉన్నతంగా నిలిచే చిత్రం ఖైదీ. సామ్ సి.ఎస్ నేపధ్య సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బలమైన సన్నివేశాలకు మరింత బలాన్నిచ్చి ప్రేక్షకులను కట్టిపడేస్తాయి కొన్ని సన్నివేశాలు. యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుందో, ఎమోషనల్ సీన్స్ లోనూ అంతే ఎఫెక్టివ్ గా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. కథ మొత్తం ఒక రాత్రే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం నైట్ షూట్. అయినా కానీ సినిమాటోగ్రాఫర్ ఎఫెక్టివ్ గా తెరకెక్కించాడు. ఏ ఫ్రేమ్ కూడా మోనాటోనీ కాకుండా ఉండడం సినిమాకు కలిసొచ్చింది. నిర్మాత గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఏ మాత్రం అనవసర కమర్షియల్ హంగులు లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం నిజంగా ఓ ప్రయోగమే. ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించడానికి గట్స్ ఉండాలి. దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ మొదటి సినిమాతోనే తన ప్రతిభ చాటుకున్నాడు. అయితే ఖైదీ మాత్రం తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం. భవిష్యత్తులో లోకేష్ ఎన్ని మంచి చిత్రాలు చేసినా ఖైదీ మాత్రం తన కెరీర్‌లో స్పెషల్‌గా మిగిలిపోతుంది.
ఒక్కమాటలో : ‘ఖైదీ’…మాంచి థ్రిల్లింగ్ మూవీ

Latest Articles
నిద్రలో స్టేషన్‌ మాస్టర్‌.. రైలు సిగ్నల్‌ కోసం అరగంట పాటు..
నిద్రలో స్టేషన్‌ మాస్టర్‌.. రైలు సిగ్నల్‌ కోసం అరగంట పాటు..
మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు
మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు
అందుకే దూరమయ్యాం. ప్రవీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా
అందుకే దూరమయ్యాం. ప్రవీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా
ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్మినల్ భవనం
కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్మినల్ భవనం
కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. ప్రధాని మోదీ..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. ప్రధాని మోదీ..
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..