ముఖ్యమంత్రి భార్యతో సూపర్ స్టార్ వైఫ్ భేటీ..! ఎందుకంటే..?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఫ్ భారతిని.. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ భేటీ అయ్యారు. సాధారణంగా నమ్రత.. బయట ఎక్కువగా ఎవరినీ కలవరు. అలాంటిది.. వైఎస్ భారతిని కలవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయమే. కాగా.. కొద్దిరోజుల క్రితమే.. చిరంజీవి వెళ్లి జగన్‌ కలవడంతో.. అటు రాజకీయంగానూ.. ఇటు సినీ రంగంలోనూ హీట్ పుట్టింది. అలాంటిది ఇప్పుడు చిరు తరువాత.. నమ్రత వెళ్లి భారతినితో భేటీ కావడం వెనుక ఏదో […]

  • Updated On - 2:40 pm, Fri, 25 October 19 Edited By:
ముఖ్యమంత్రి భార్యతో సూపర్ స్టార్ వైఫ్ భేటీ..! ఎందుకంటే..?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఫ్ భారతిని.. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ భేటీ అయ్యారు. సాధారణంగా నమ్రత.. బయట ఎక్కువగా ఎవరినీ కలవరు. అలాంటిది.. వైఎస్ భారతిని కలవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయమే. కాగా.. కొద్దిరోజుల క్రితమే.. చిరంజీవి వెళ్లి జగన్‌ కలవడంతో.. అటు రాజకీయంగానూ.. ఇటు సినీ రంగంలోనూ హీట్ పుట్టింది. అలాంటిది ఇప్పుడు చిరు తరువాత.. నమ్రత వెళ్లి భారతినితో భేటీ కావడం వెనుక ఏదో ఉందని సమాచారం.

కాగా.. అమరావతిలోని.. తాడేపల్లిలోని సీఎం ఇంట్లో వైఎస్ భారతితో భేటీ అయ్యింది నమ్రతా శిరోద్కర్. ఆంధ్రప్రదేశ్‌లోని హీరో మహేష్ బాబు దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామం ఫౌండేషన్ వివరాలు వైఎస్ భారతికి నమ్రత వివరించింది. ప్రభుత్వం నుంచి బుర్రిపాలెం గ్రామం కోసం సహకారం అందించాలని వైఎస్ భారతిని కోరింది నమ్రత. బుర్రిపాలెం గ్రామం.. గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందింది. ఇది సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం.