Tollywood: బైక్ నడపడం రాని హీరో.. గూగుల్ పే చెయ్యడం తెలియని హీరో టాలీవుడ్‌లో ఉన్నారు.. వారు ఎవరంటే..?
అందరికీ అన్ని రావాల్సిన పని లేం. మనం ఏమైనా ఫుల్లీ ప్రొగ్రామ్డ్ డేటా బేస్‌తో దిగి వచ్చామా చెప్పండి.. అన్నీ వచ్చేయడానికి. హే.. నీకు బైక్ నడపడం కూడా రాదని ఈ సారి ఎవరైనా అంటే... ఆ పాన్ ఇండియా ఇండియా హీరోకు కూడా రాదురా అని గర్వంగా సమాధానం ఇవ్వండి.

మెజార్టీ జనాలకు వచ్చిన పనులు మనకు రాకపోతే అదేంటో చులకనగా చూస్తారు జనాలు. వాటిపై వారికి ఇంట్రస్ట్ లేదని వదిలెయ్యరు. అదేదో పెద్ద లోపంలా గేలి చేస్తుంటారు. కొందరికి బైక్ నడపడం అంటే భయం ఉంటుంది.. అందుకే డ్రైవ్ చెయ్యరు. మరికొందరికి వారు పెరిగిన పల్లెటూరి వాతావరణం కారణంగా టెక్నికల్ అంశాలపై అవగాహన ఉండదు. ఇలా కొందరికి కొన్ని పనులు రావు. ఇప్పుడు మీకు ఇద్దరు టాలీవుడ్ హీరోలను పరిచయం చేయబోతున్నాం.. వారిలో ఒకరికి బైక్ నడపడం రాదు.. మరొకరికి ఫోన్ పే, గూగుల్ పే చెయ్యడం కూడా తెలీదు.
- రానా దగ్గుబాటి
మన భల్లాల దేవుడికి బైక్ నడపడం రాదు అంటే అస్సలు ఎవ్వరూ నమ్మరు కూడా. కానీ అది వాస్తవం. అది కూడా మేము చెప్పలేదు. తనే చెప్పాడు. ఇటీవలే ఉస్తాద్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన రానా.. తనకు బైక్ నడపడం తెలియదని వెల్లడించాడు. తనకు వెహికిల్స్‌తో పెద్ద కనెక్షన్ ఉండదని.. కానీ బైక్‌ను బాగా నడిపేవాళ్లంటే ఇష్టమని వెల్లడించాడు.
2. నేచురల్ స్టార్ నాని
ఇక మన నాని అయితే తాను టెక్నికల్లీ హ్యాండిక్యాప్డ్ అని తనకు తానే ప్రకటించుకున్నాడు. ఫోన్ పే, గూగుల్ పే యూజ్ చెయ్యడం తెలీదని.. కనీసం ఫుడ్ ఎలా ఆర్డర్ పెట్టాలో కూడా తెలియదని వెల్లడించాడు. బ్యాంకు పనులు ఎలా చెయ్యాలో మినిమం తెలియదని దసరా సినిమా సమయంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.