AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naatu Naatu Song: విశ్వవేదికపై ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఆస్కార్ అవార్డ్స్ వేడుకని మన టీవీ9లో ఇలా లైవ్ లో చూడండి..

ప్రపంచ సినిమా పండగని ఎప్పటికప్పుడు మీకు చూపించి మినిట్ టు మినిట్ రిపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ నుంచి 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకని టీవీ9లో చూడండి.

Naatu Naatu Song: విశ్వవేదికపై ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఆస్కార్ అవార్డ్స్ వేడుకని మన టీవీ9లో ఇలా లైవ్ లో చూడండి..
Oscars Award
Rajitha Chanti
|

Updated on: Mar 10, 2023 | 9:29 AM

Share

ఆస్కార్ నామినేషన్‏లో ‘నాటు నాటు’ అని వినగానే తెలుగు వాటి గుండె రెట్టింపు శబ్దం చేసింది. ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ తుఫాన్ ఆస్కార్ బరిలో నిలిచింది.. ఇప్పుడు టీవీ 9 టీం ఆస్కార్ వేడుక జరిగే ప్రాంగణంలో వుంది .. ఆర్ఆర్ఆర్ కి ప్రపంచం వేసిన రెడ్ కార్పెట్ దగ్గర ఇండియాస్ నెంబర్ వన్ నెట్వర్క్ టీవీ 9 అప్ డేట్స్ ఇవ్వడానికి సిద్ధం గా వుంది ..ప్రపంచ సినిమా పండగని ఎప్పటికప్పుడు మీకు చూపించి మినిట్ టు మినిట్ రిపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ నుంచి 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకని టీవీ9లో చూడండి.

95వ ఆస్కార్ వేడుకను మీకు అందించడానికి టివి 9 లాస్ ఏంజెల్స్ లో ఉంది .. 94 ఏళ్ళ ఆస్కార్ ప్రయాణంలో ఎంతమంది ఇండియన్స్ ఆస్కార్ అందుకున్నారో తెలుసా .. అతి కొద్దీ మంది మాత్రమే … 1982లో గాంధీ సినిమాకి బెస్ట్ కాస్ట్యూమ్ డిసైనర్ గా భాను అధయ .. మొదటి ఆస్కార్ అందుకున్న భారతీయురాలు ఆమె … ఆ తర్వాత సత్యజిత్ రే ఆ తర్వాత స్లం డాగ్ మిలీయనీర్ కి ఏకంగా ముగ్గురు భారతీయులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.. 2019 లో కూడా భారతీయ డాక్యూమెంటరీకి ఆస్కార్ వచ్చింది .. ఆ దిశగా ఇప్పుడు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో బరిలో నిలిచింది నాటు నాటు. ఆర్ఆర్ఆర్ కి అవార్డు దక్కాలని ఆశిద్దాం.

ఒళ్ళు చమట పట్టేలా వీరంగం ఆడినట్టు ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచిన ఒరిజినల్ సాంగ్ నాటు నాటు .. ఆ పాట కి ఎంత శ్రమ పడ్డారో తెలుసా .. ఏడు రోజులు ఓన్లీ రిహార్సల్స్ మాత్రమే చేసారు. 150 మంది డాన్సర్స్ ఈ పాటలో వున్నారు. 200 మంది నటీనటులు నాటు నాటులో నటించారు.. మొత్తం 17 రోజులకు పైగా ఈ పాట చిత్రీకరణ చేసారు .. ఫైనల్ అవుట్ ఫుట్ వచ్చిన తర్వాత మాత్రం మారు మూల పల్లెనించి గ్లోబ్ మూల దేశం దాకా కాలు కలిపిన పాట గా ఇప్పుడు ఆస్కార్ గెలుపు తలుపు తట్టడానికి అడుగు దూరంలో ఉంది.

ఇవి కూడా చదవండి

మార్చి 12 ఆదివారం సాయంత్రం 5 గంటలనుండి ప్రపంచ సినిమా వేడుక ఆస్కార్ ప్రారంభం కానుంది. ఇప్పటికే లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ సెలబ్రిటీస్ కి వెల్కమ్ చెప్పడానికి ముస్తాబు అవుతోంది. ఈ సారి ఆస్కార్ అవార్డ్స్ ని హోస్ట్ చేసేది జిమ్మీ కిమ్మెల్. “The World’s 100 Most Influential Peopleలో జిమ్మీ కూడా ఉన్నారు. రేడియోతో కెరీర్ స్టార్ట్ చేసి ఆతర్వాత టెలివిషన్ షోకి రైటర్ గా ప్రొడ్యూసర్ గా ఉన్నా జిమ్మీ కిమ్మెల్, చాల అవార్డ్స్ ఫంక్షన్స్ కి హోస్ట్ గా వ్యవహరించాడు. ప్రముఖ కమెడియన్స్ లో జిమ్మీ కిమ్మెల్ ని కూడా ఒకరిగా చెప్తారు. ఆ హోస్ట్ నోటి వెంట నాటు నాటుకి నా ఓటు అని వినాలని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది తెలుగు వాడి విజయ బావుటా ఆస్కార్ వేదిక మీద ఎగరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది టీవీ 9.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.