Tollywood: ఈ ఫోటోలోని చిన్నారికి ఉన్న ఫాలోయింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. పెళ్లైనా తగ్గేదేలే అంటున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టండి..

ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసి దశాబ్ధం కాలం దాటిన తర్వాత సౌత్ ఇండస్ట్రీపై మనసు పారేసుకుంది. గుర్తుపట్టరా ఎవరో. మరో చిన్న క్లూ.. పైళ్లైనా ఏమాత్రం తగ్గదే లే అంటూ వరుస చిత్రాలతో అగ్రకథానాయికగా కొనసాగుతుంది.

Tollywood: ఈ ఫోటోలోని చిన్నారికి ఉన్న ఫాలోయింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. పెళ్లైనా తగ్గేదేలే అంటున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 10, 2023 | 9:03 AM

బూరె బుగ్గలతో ముద్దులొలుకుతున్న ఈ బుజ్జాయి.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. అందం… అభినయంతో.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా.. ధైర్యంగా పోరాడి గెలిచింది. డిప్రెషన్.. ఒత్తిడి కారణంగా ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే తెలుగులోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యింది. ఎవరో గుర్తుపట్టండి. ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసి దశాబ్ధం కాలం దాటిన తర్వాత సౌత్ ఇండస్ట్రీపై మనసు పారేసుకుంది. గుర్తుపట్టరా ఎవరో. మరో చిన్న క్లూ.. పైళ్లైనా ఏమాత్రం తగ్గదే లే అంటూ వరుస చిత్రాలతో అగ్రకథానాయికగా కొనసాగుతుంది.

ఆ బూరె బుగ్గల చిన్నారి మరెవరో కాదండి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. 1986 జనవరి 5న డెన్మార్క్ లోని కోపన్ హాగన్ లో జన్మించింది దీపికా. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆమె కుటుంబంలో బెంగుళూరుకు షిప్ట్ అయ్యింది. బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేసింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. మొదట పలు యాడ్స్ లో నటించిన ఈ చిన్నది.. 2006లో కన్నడ హీరో ఉపేంద్ర నటించిన ఐశ్వర్య సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఏడాది ఓం శాంతి ఓం చిత్రంలో నటించింది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా తర్వాత బీటౌన్‏లో దీపికాకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. దాదాపు దశాబ్ద కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ అగ్రకథానాయికగా చక్రం తిప్పింది. కెరీర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలోనే తన ప్రియుడు హీరో రణ్వీర్ సింగ్‏ను 2018లో వివాహం చేసుకున్నారు దీపికా. ఇటీవలే షారుఖ్ ఖాన్ సరసన పఠాన్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తుంది.

View this post on Instagram

A post shared by Levi’s (@levis)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.