Virata Parvam First Day Collections: బాక్సాఫీస్ వద్ద విరాట పర్వం హవా.. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే..
నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నక్సలైట్ రవన్న పాత్రలో రానా, వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించగా.. ప్రియమణి, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ కీలకపాత్రలలో నటించారు.
డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాటపర్వం సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. సాయి పల్లవి(Sai Pallavi) , రానా కలిసి నటించిన ఈ మూవీ జూన్ 17న విడుదలైన సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే (Virata Parvam). నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నక్సలైట్ రవన్న పాత్రలో రానా, వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించగా.. ప్రియమణి, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ కీలకపాత్రలలో నటించారు. ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ తో విడుదలకు ముందే సినిమాపై అంచనాలను క్రియేట్ చేశారు మేకర్స్. వెన్నెల పాత్ర చుట్టూ ఈ సినిమా ఉంటుందని… 1990లో జరిగిన యదార్థ సంఘటనకు ప్రేమను జోడించి అందమైన ప్రేమకావ్యంగా తీసుకువస్తున్నానంటూ ముందు నుంచి డైరెక్టర్ వేణు ఉడుగులు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. రానా, సాయి పల్లవి అద్భుతంగా నటించారని.. డైరెక్టర్ వేణు ఉడుగుల స్క్రీన్ ప్లే బాగుందంటూ ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజే రూ. 14 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమా ప్రారంభ రోజే.. అడ్వాన్స్డ్ బుకింగ్స్ ద్వారా దాదాపు రూ. 2.5 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి..ఈ చిత్రాన్ని 245 లొకేషన్స్‌లో ప్రీమియర్ షోల నుంచి యూఎస్ఏ నుంచి యూఎస్డీ 60 డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. ఇక మొదటి రోజే 25-50 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంది. విరాట పర్వం చిత్రానికి ముందు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. డి సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రాన్ని కేరళలోని దరిపల్లి, పర్కల్ అడవులలో, వికారాబాద్, వరంగల్ అడవులలో చిత్రీకరించారు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..