Vijayashanthi: నందమూరి హీరో సినిమాలో విజయశాంతి.. మూడేళ్ల తర్వాత కొత్త ప్రాజెక్ట్‏కు ఓకే..

మూడేళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన ఈ మూవీలో కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ తో పోటాపోటీగా నటించి మరోసారి అలనాటి విజయశాంతిని గుర్తుచేశారు. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అంగీకరించలేదు. తాజాగా ఇప్పుడు మరో సినిమాకు ఓకే చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత కొత్త సినిమాకు సైన్ చేసింది విజయశాంతి. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది.

Vijayashanthi: నందమూరి హీరో సినిమాలో విజయశాంతి.. మూడేళ్ల తర్వాత కొత్త ప్రాజెక్ట్‏కు ఓకే..
Vijayashanthi
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 21, 2023 | 8:00 AM

విజయశాంతి.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. దాదాపు మూడు దశాబ్దాలు తన నటనతో సినీ ప్రియులను అలరించింది. మెగాస్టార్ చిరంజీవి, కృష్ణ, సోభన్ బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. కర్తవ్యం సినిమాలో ఆమె నటనకుగానూ జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమాలకు దూరమయ్యారు. అయితే మూడేళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన ఈ మూవీలో కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ తో పోటాపోటీగా నటించి మరోసారి అలనాటి విజయశాంతిని గుర్తుచేశారు. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అంగీకరించలేదు. తాజాగా ఇప్పుడు మరో సినిమాకు ఓకే చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత కొత్త సినిమాకు సైన్ చేసింది విజయశాంతి. శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది.

ప్రస్తుతం డెవిల్ సినిమాతో బిజీగా ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్..అంతలోనే తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఇందులో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఇదే సినిమాలో విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగన ఈ మూవీ ప్రారంభోత్సవ వేడుకలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్ కొట్టగా.. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానా్ని అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ 1940 నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.