Varisu: నెట్టింటిని షేక్ చేస్తోన్న విజయ్ దళపతి.. రష్మిక ఫోటోస్.. వారసుడు మూవీ వర్కింగ్ స్టిల్స్ చూశారా ?..
తాజాగా మరోసారి వారసుడు చిత్రానికి సంబధించిన పది స్టిల్స్ ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'వారసుడు' స్టిల్స్ వైరల్ గా మారాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వారసుడు సినిమా వర్కింగ్ స్టిల్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. దళపతి విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం తమిళ్, తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ అప్డేట్స్ కోసం దళపతి ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేశారు మేకర్స్. తాజాగా మరోసారి ఈ చిత్రానికి సంబధించిన పది స్టిల్స్ ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘వారసుడు‘ స్టిల్స్ వైరల్ గా మారాయి.
వారసుడులో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు. అలాగే విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి. 2023 సంక్రాంతికి వారసుడు/వరిసుని విడుదల చేస్తున్నట్లు దీపావళి పండగ నాడు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో భారీ స్థాయిలో సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.
పూర్తిస్థాయి ఎంటర్ టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇందులో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త కీలకపాత్రలలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. భారీ నిర్మాణ విలువలతో లావిష్ అండ్ విజువల్ గ్రాండియర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా పని చేస్తున్నారు.
Tell us your favorite #Varisu still in the comments below! #Thalapathy @actorvijay sir @directorvamshi @iamRashmika @MusicThaman #VarisuStills#VarisuPongal pic.twitter.com/wxgJWlxhCT
— Sri Venkateswara Creations (@SVC_official) October 27, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.