Guess The Actress: ఇంత క్యూట్‌గా ఉన్న ఈ అందాల రాక్షసి ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
పైన ఫోటోలో ఉన్న ఆ క్యూట్ అందాల రాక్షసి ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్రకథానాయిక. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తుంది.
చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురం. బాల్యస్మృతులను గుర్తుచేసుకుంటే మనసు క్షణంపాటు మనసు ప్రశాంతం. ప్రస్తుతం తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా స్నేహితులకు షేర్ చేసుకుంటూ అప్పటి రోజులను తలుచుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీల బాల్యం తాలుకూ జ్ఞాపకాలు నెట్టింట వైరలవుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పలువురు స్టార్స్‌కు సంబంధించిన మధురమైన స్మృతులు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అందాల తారా చిన్నప్పటి ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆమె ఎవరో మీరు గుర్తుపడతారా ?.. కేవలం నిమిషం తదేకంగా చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ట్రై చేయండి.
పైన ఫోటోలో ఉన్న ఆ క్యూట్ అందాల రాక్షసి ఇప్పుడు ఇండస్ట్రీలో అగ్రకథానాయిక. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్తుంది. వాస్తవానికి సెలబ్రెటీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి సినీరంగ ప్రవేశం చేసి.. అందం, అభినయంతో తనపై వచ్చే ట్రోలింగ్‌కు చెక్ పెట్టింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఎవరో గుర్తుపట్టండి.
ఆ క్యూట్ గర్ల్ ఎవరో కాదు.. దివంగత హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు మిలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే తనకు తెలుగు చిత్రాల్లోనూ నటించాలని ఉందని.. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నానంటూ మనసులోని మాటను బయటపెట్టేసింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.