AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satyadev: యంగ్ హీరోకు కలిసొచ్చిన ‘రామ్ సేతు’.. ఒక్క సినిమాతో బాలీవుడ్‏లోనూ సత్తాచాటిన సత్యదేవ్..

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు. ఆ చిత్రం హిందీలోనూ విడుదలైంది. ఈ చిత్రంలో సత్యదేవ్ పూర్తి స్థాయి పాత్రలో నటించి మంచి మార్కులను కొట్టేశారు.

Satyadev: యంగ్ హీరోకు కలిసొచ్చిన 'రామ్ సేతు'.. ఒక్క సినిమాతో బాలీవుడ్‏లోనూ సత్తాచాటిన సత్యదేవ్..
Sathyadev
Rajitha Chanti
|

Updated on: Oct 27, 2022 | 8:35 PM

Share

యంగ్ హీరో సత్యదేవ్ కాంచరాన.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేనిపేరు. సహనటుడిగా కెరీర్ ఆరంభించి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా పాత్ర ప్రాధాన్యతతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గానూ నటించి మెప్పిస్తారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా కనిపించి మెప్పించారు. విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో తాజాగా విడుదలైన చిత్రం ‘రామ్ సేతు’తో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు . ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించారు.‘రామ్ సేతు’ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అద్భుతమైన రామ్ సేతు కట్టడం నాశనం కాకుండా కాపాడే ఆర్కియాలజిస్ట్ పాత్రలో అక్షయ్ నటించి మెప్పించారు. అక్షయ్‌తో పాటు జాక్వలైన్ ఫెర్నాండెజ్, సుస్రత్ బరుచా నటించిన ఈ మూవీలో సత్యదేవ్ కూడా కీలక పాత్రలో నటించారు.

నిజాయతీతో కూడా స్టోరీ లైన్, అక్షయ్ కుమార్ నటనతో పాటు సత్యదేవ్ నటనకు కూడా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు, సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు నటించని ఓ డిఫరెంట్ రోల్‌లో సత్యదేవ్ నటించి ఆకట్టుకున్నారు. సినిమాను చూసిన అభిమానులు, ఆడియెన్స్ ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సత్యదేవ్ అద్భుతంగా నటించి తొలి చిత్రంతోనే అలరించారని అతని నటనను, పాత్రను అప్రిషియేట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు. ఆ చిత్రం హిందీలోనూ విడుదలైంది. ఈ చిత్రంలో సత్యదేవ్ పూర్తి స్థాయి పాత్రలో నటించి మంచి మార్కులను కొట్టేశారు. రామ్ సేతు చిత్రం సత్యదేవ్ డెబ్యూ మూవీగా సక్సెస్ సాధించి ఆయన కలను నేరవేర్చింది.