AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్య కోసం భారీ యాకన్ సన్నివేశాలు..వీరసింహరెడ్డి సినిమాకే హైలెట్ గా నిలిచేలా..

బాలకృష్ణకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, విలన్ బ్యాచ్‌ పై ఉత్కంఠభరితమైన భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు.

Balakrishna: బాలయ్య కోసం భారీ యాకన్ సన్నివేశాలు..వీరసింహరెడ్డి సినిమాకే హైలెట్ గా నిలిచేలా..
Nandamuri balakrishna
Rajitha Chanti
|

Updated on: Oct 27, 2022 | 9:28 PM

Share

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం వీరసింహరెడ్డి. డైరెక్టర్ గోపిచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, విలన్ బ్యాచ్‌ పై ఉత్కంఠభరితమైన భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కథలో కీలకమైన సమయంలో రానున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ ని దర్శకుడు అద్భుతమైన రీతిలో తెరకెక్కిస్తున్నారు. ఫైట్ మాస్టర్ వెంకట్ ఫైట్ సీక్వెన్స్‌ని పర్యవేక్షిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రం కథ యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ఈ చిత్రానికిసంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. వీరసింహారెడ్డి 2023 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Follow Us
WTC ఫైనల్ బెర్త్ కోసం గిల్ సేన గెలవాల్సిన మ్యాచ్‌లు ఇవే!
WTC ఫైనల్ బెర్త్ కోసం గిల్ సేన గెలవాల్సిన మ్యాచ్‌లు ఇవే!
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..