Merry Christmas: సంక్రాంతి బరిలో ‘మేరీ క్రిస్మస్’.. మహేష్ బాబుకు పోటీగా వస్తోన్న విజయ్ సేతుపతి..

ఇప్పటికే జవాన్ సినిమాతో నార్త్ అడియన్స్ కు దగ్గరయ్యాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు మరోసారి మేరీ క్రిస్మస్ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ రెండో వారంలో ఈ మూవీని విడుదల చేస్తున్నామని ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవుతాయనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ మూవీని మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Merry Christmas: సంక్రాంతి బరిలో 'మేరీ క్రిస్మస్'.. మహేష్ బాబుకు పోటీగా వస్తోన్న విజయ్ సేతుపతి..
Merry Christmas Movie
Follow us

|

Updated on: Nov 16, 2023 | 8:46 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ‘మేరీ క్రిస్మస్’. ఈ సినిమా కోసం మక్కల్ సెల్వన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జవాన్ సినిమాతో నార్త్ అడియన్స్ కు దగ్గరయ్యాడు విజయ్ సేతుపతి. ఇప్పుడు మరోసారి మేరీ క్రిస్మస్ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ ఏడాది చివర్లో అంటే డిసెంబర్ రెండో వారంలో ఈ మూవీని విడుదల చేస్తున్నామని ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవుతాయనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ మూవీని మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రాన్ని అడియన్స్ ముందుకు తీసుకురానున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో మేరీ క్రిస్మస్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. ఈ క్రమంలోనే మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయానికి షారుఖ్ నటించిన డుంకీ, ప్రభాస్ నటించిన సలార్ విడుదల కాబోతున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు వినిపిస్తోన్న సమాచారం ప్రకారం మేరీ క్రిస్మస్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ కొత్త పోస్టర్ షేర్ చేశారు. కొత్తగా రిలీజ్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను తమిళ్, హిందా భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. హిందీ వెర్షన్ లో సంజయ్ కపూర్, రాధిక ఆప్టే, పాటక్ వినయ్, గాయత్రి శంకర్, ప్రతిమ ఖన్నా కీలకపాత్రల్లో నటించారు. అలాగే తమిళ్ వెర్షన్ లో రాధిక శరత్ కుమార్, షణ్ముఖ రాజా, రాజేష్ విలయమ్స్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రీతం చక్రవర్తి సంగీతం అందిస్తుండగా.. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. టిప్స్ ఫిలిమ్స్, మ్యాచ్ బాక్స్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.