Tollywood: డాక్టర్‍గా మారిన హీరోయిన్.. మాస్క్ చాటున దాగున్న ఆ స్టార్ డైరెక్టర్ కూతురిని గుర్తుపట్టండి..
సౌత్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి డాక్టర్ చదువు పూర్తి చేసింది. ఇటు వెండితెరపై కథానాయికగా అలరిస్తోంది. మరోవైపు యంగ్ హీరోయిన్ శ్రీలీల ఓవైపు వైద్య విద్యను అభ్యసిస్తూనే.. మరోవైపు టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. అయితే ఓ హీరోయిన్ మాత్రం అటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూనే ఇటు వైద్య వృత్తిని కొనసాగిస్తుంది. పైన ఫోటోను చూశారా ?.. అందులో డాక్టర్‍గా కనిపిస్తోన్న ఆ హీరోయిన్ సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. అంతేకాదు.. ఆమె తండ్రి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?..

సాధారణంగా డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయినవాళ్లను చాలా మందిని చూసే ఉంటారు. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనుకుని ఎన్నో కలలు కని.. అనుహ్యంగా సినీ పరిశ్రమలో సెటిల్ అవుతుంటారు. ఇప్పటివరకు సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో టాప్ స్థానాల్లో ఉన్న నటీనటులు ఈ కోవకు చెందిన వారే. సౌత్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి డాక్టర్ చదువు పూర్తి చేసింది. ఇటు వెండితెరపై కథానాయికగా అలరిస్తోంది. మరోవైపు యంగ్ హీరోయిన్ శ్రీలీల ఓవైపు వైద్య విద్యను అభ్యసిస్తూనే.. మరోవైపు టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. అయితే ఓ హీరోయిన్ మాత్రం అటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూనే ఇటు వైద్య వృత్తిని కొనసాగిస్తుంది. పైన ఫోటోను చూశారా ?.. అందులో డాక్టర్‍గా కనిపిస్తోన్న ఆ హీరోయిన్ సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. అంతేకాదు.. ఆమె తండ్రి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.. తను మరెవరో కాదు.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ తనయ అదితి శంకర్.
అదితి శంకర్.. 1993 జూన్ 19న చెన్నైలో జన్మించింది. కోలీవుడ్ హీరో కార్తి సరసన విరుమాన్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తమిళంలో మరిన్ని అవకాశాలు అందుకుంది. ఇటీవలే శివకార్తికేయ జోడిగా మావీరన్ చిత్రంలో కనిపించింది అదితి. కేవలం నటిగానే కాకుండా మావీరన్ సినిమాతో సింగర్‌గానూ నిరూపించుకుంది అదితి. అంతేకాదు.. నటిగా తెరంగేట్రం చేయకముందే అదితి డాక్టర్ గా సేవలు చేసింది. శ్రీరామచంద్ర యూనివర్సిటీలో అదితి తన ఎంబీబీఎంస్ పూర్తి చేసింది.
View this post on Instagram
తాజాగా డాక్టర్‍గా విధులు నిర్వహిస్తున్న ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ డాక్టర్ A అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో తన కుటుంబంతో కలిసి తన గ్రాడ్యూయేషన్ సర్టిఫికేట్ తీసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది అదితి. “ఎన్నో సరదా జ్ఞాపకాలు.. నిద్రలేని రాత్రులు, అర్ధరాత్రుల్లు కాఫీ కప్పులు నన్ను ఇక్కడకు తీసుకువచ్చాయి. అధికారికంగా డాక్టర్ అదితి శంకర్” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం అదితి లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి.
Here’s to all the fun memories, late nights and mugs of coffee that got me here ✨ Officially Dr.Aditi Shankar #graduationday #endsandbeginnings pic.twitter.com/bws6Wlcy1O
— Aditi Shankar (@AditiShankarofl) December 11, 2021
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.