Vijay Deverakonda: ట్రోల్స్ పై స్పందించిన విజయ్ దేవరకొండ.. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు అంటూ..
దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఈ క్రమంలో మీడియాతో
మోస్ట్ అవైయిటెడ్ చిత్రం లైగర్. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో విజయ్ (Vijay Deverakonda) బాక్సర్ గా కనిపిస్తుండగా.. అతని సరసన అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 25న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఈ క్రమంలో మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు విజయ్. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలీలో సమాధానాలు ఇచ్చారు. అదే సమయంలో ట్రోల్స్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విజయ్ స్పందిస్తూ.. ట్రోల్స్ చేయడం కామన్. రోజు జరిగే విషయమే. నేను హీరో, నటుడు కాకముందు కూడా నన్ను మా అంకుల్స్, ఆంటీస్ , కాలేజీలో స్నేహితులు, సన్నిహితులు ట్రోల్ చేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుంది. అది ఏ విషయమైన కావచ్చు. ట్రోలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది. నేను పెద్దగా పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చారు విజయ్.
అలాగే. తనకు రీమేకులు ఫ్రీమేకులు ఇష్టం ఉండదని.. ఆ సినిమా కథతో కొంచెం పోలిక వున్న చేయనని.. పైగా లైగర్ లో వున్నది బాక్సింగ్ కాదు. ఎంఎంఎ అనే మార్షల్ ఆర్ట్స్. అమ్మా నాన్న తమిళమ్మాయితో లైగర్ కి ఎలాంటి పోలిక లేదని అన్నారు.
#LIGER movie Amma Nanna oo thamil ammay movie la undi Anna prathi hater ravalâmma ?#VijayDeverakonda ?????? pic.twitter.com/3jKLIFC4SC
— prashanth (@prashanthmacha1) August 15, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.