AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: ‘సీతారామం’ బ్యూటీకి ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో నటించాలని ఉందట.. ఇంతకు ఆయన ఎవరంటే

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాల హిట్స్ కొత్త ఊపిరిని పోస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన బింబిసార , సీతారామం, కార్తికేయ 2 సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Mrunal Thakur: 'సీతారామం' బ్యూటీకి ఆ టాలీవుడ్ స్టార్ హీరోతో నటించాలని ఉందట.. ఇంతకు ఆయన ఎవరంటే
Mrunal Thakur
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2022 | 2:52 PM

Share

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాల హిట్స్ కొత్త ఊపిరిని పోస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన బింబిసార , సీతారామం, కార్తికేయ 2 సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటించింది. తొలి సినిమాతోనే మృణాల్ తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టేసింది. ఈ అమ్మడి నటన, అందం చూసిన ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. అంతే కాదు ఈ చిన్నదానికి తెలుగులో ఆఫర్లు క్యూకడుతున్నాయని తెలుస్తోంది. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తారక్ నెక్స్ట్ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా తర్వాత కొరటాల ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందని టాక్. ఇక ఈ విషయం పై మృణాల్ స్పందిస్తూ.. తారక్ అంటే నాకు చాలా ఇష్టం.. ఆయనతో నటించాలని ఎదురుచూస్తున్నా..అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ ముద్దుగుమ్మ ఆశలు నెరవేరుతాయో లోదో చూడాలి. అటు మరో క్యూటీ జాన్వికపూర్ కూడా తారక్ తో కలిసి నటించడానికి ఎదురుచూస్తోంది. ఇటీవలే ఈ అమ్మడు తన మనసులో మాట చెప్పుకొచ్చింది. ఇప్పుడు మృణాల్ కూడా తారక్ తో నటించాలని ఉందనడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!