AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: సామ్‌కు అనారోగ్యం.. ఖుషి సినిమా విడుదల అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విజయ్

ఖుషి సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్‌ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా విడుదల చేద్దామని మేకర్స్‌ కూడా భావించారు. అయితే ఇంతోలోనే సామ్‌ అనారోగ్యం బారిన పడింది.

Vijay Devarakonda: సామ్‌కు అనారోగ్యం.. ఖుషి సినిమా విడుదల అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విజయ్
Vijay Deverakonda, Samantha
Basha Shek
|

Updated on: Nov 04, 2022 | 5:24 PM

Share

టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తోన్న చిత్రం ఖుషి. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్‌ సరసన సమంత కథానాయికగా కనిపించనుంది. నిన్నుకోరి, మజిలీ, టక్‌ జగదీష్‌ లాంటి ఫీల్‌గుడ్‌ సినిమాలను అందించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రతిష్ఠాత్మక మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే  ఖుషి సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్‌ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా విడుదల చేద్దామని మేకర్స్‌ కూడా భావించారు. అయితే ఇంతోలోనే సమంత అనారోగ్యం బారిన పడింది. మయోసైటిస్‌ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలపడంతో ఖుషి సినిమా అనుకున్న సమయానికే వస్తుందా? లేదా? అన్నది సందేహంగా మారింది. అయితే చాలామంది అనుకున్నట్లే ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీనిపై హీరో విజయ్‌ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు.

‘ఖుషి సినిమా షూటింగ్‌ 60శాతం పూర్తయింది. మొదట మేము ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించాం. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నాం’ అని విజయ్‌ తెలిపాడు. కాగా ఈ ఏడాది ఆగస్టులో లైగర్‌ సినిమాతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చాడు విజయ్‌. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్లాప్‌గా నిలిచింది. దీంతో ఖుషి సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు విజయ్‌. ఈ సినిమాలో కోలీవుడ్‌ నటుడు జయరాం, సచిన్‌ ఖేడ్కర్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, అలీ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శరణ్య రోహిణీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..