Vijay Devarakonda: 2025లో అయినా పెళ్లి చేసుకుంటావా ? విజయ్ దేవరకొండ రియాక్షన్ ఇదే..
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు నిత్యం సోషల్ మీడియాలో మారుమోగుతుంది. సినిమాల కంటే ఎక్కువగా విజయ్ పర్సనల్ లైఫ్ గురించి ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంటుంది. తాజాగా తన పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశాడు విజయ్.
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో ఇప్పుడు హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. అయితే మూవీ అప్డేట్స్ గురించి కాకుండా విజయ్ నిత్యం తన పర్సనల్ లైఫ్ విషయాలతో వార్తలలో నిలుస్తుంటాడు. విజయ్ దేవరకొండ ప్రేమ, పెళ్లి గురించి ఏదోక న్యూస్ చక్కర్లు కొడుతుంది. హీరోయిన్ రష్మికతో విజయ్ ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటినుంచో ప్రచారం నడుస్తుంది. ఇక వీరిద్దరి లవ్, మ్యారేజ్ గురించి అనేకసార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ ఇద్దరు తమ రిలేషన్ స్టేటస్ పై రియాక్ట్ కాలేదు. తాజాగా విజయ్ తన ఇన్ స్టా స్టోరీలో మాత్రం పెళ్లి గురించి ఓ వీడియో పోస్ట్ చేశాడు.
తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో విజయ్ ఓ వీడియో షేర్ చేశాడు. అందులో 2025లో అయినా పెళ్లి చేసుకుంటావా ? లేదా? అని జనాలు అడిగితే.. ఇలా రజినీలా నవ్వేసి.. అటూ ఇటూ చూసేసి నవ్వుకుంటాడట. అంటే వచ్చే ఏడాదిలో అయినా పెళ్లి చేసుకుంటానో లేదో అన్న గ్యారెంటీ లేదన్నట్లుగా ముందే హింట్ ఇచ్చేశాడ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కలిసి గీతా గోవిందం సినిమాలో నటించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో మరోసారి వీరిద్దరు కలిసి డియర్ కామ్రేడ్ చిత్రంలో మెరిసారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అంతగా కమర్షియల్ హిట్ కాలేదు. విజయ్, రష్మిక ఆన్ స్క్రీన్, ఆఫ్ స్కీన్ బాండింగ్ ను చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇక రష్మిక కూడా ఎక్కువగా విజయ్ ఫ్యామిలీతో కలిసి కనిపిస్తుంది. ప్రస్తుతం వీరిద్దరు తమ అప్ కమింగ్ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు.
Vijay Deverakonda's Insta Story About His Marriage 😄🔥#VijayDeverakonda #VD12 #rashmikamandhana pic.twitter.com/LtuHpWdDNQ
— Gems of 5G!!! (@Gemsof5G) December 20, 2024
View this post on Instagram
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.