Vijay Devarakonda: పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో హాజరైన విజయ్ దేవరకొండ.. వీడియో చూశారా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు సక్సెస్ అయినా, ప్లాఫ్ అయినా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. ఇక విజయ్ కూడా తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులకు ఎంతో గౌరవం, మర్యాద ఇస్తాడు. వారు అడిగింది కాదనకుండా ఇస్తాడు

Vijay Devarakonda: పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో హాజరైన విజయ్ దేవరకొండ.. వీడియో చూశారా?
Vijay Devarakonda
Follow us

|

Updated on: Apr 23, 2024 | 5:51 PM

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు సక్సెస్ అయినా, ప్లాఫ్ అయినా అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. ఇక విజయ్ కూడా తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానులకు ఎంతో గౌరవం, మర్యాద ఇస్తాడు. వారు ఏ సాయమైనా అడిగితే కాదనకుండా  హెల్ప్  చేస్తాడు. అలాగే తన సిబ్బంది పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తుంటాడు. వారి కష్ట, సుఖాల్లోనూ పాలు పంచుకుంటుంటాడు. అలా తాజాగా తన పర్సనల్‌ గార్డ్‌ పెళ్లికి హాజరై సందడి చేశాడు విజయ్ దేవరకొండ. కొత్త దంపతులను ఆశీర్వదించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన విజయ్‌ను అక్కడి పెద్దలు ఘనంగా సన్మనించారు. అనంతరం కత్తిని బహూకరించారు. అలాగే రౌడీ హీరో కలిసి ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే. .ఖుషి తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవర కొండ. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. పరశు రామ్ పెట్ల దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజైన ఫ్యామిలీ స్టార్ యావరేజ్ గా నిలిచింది. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుందీ మూవీ. త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయనున్నాడు ఫ్యామిలీ స్టార్. దీని తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. VD12 (వర్కింగ్ టైటిల్ ) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇందులో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లిలో విజయ్ దేవర కొండ కుటుంబ సభ్యులు.. వీడియో ఇదిగో..

త్వరలోనే ఓటీటీలో సందడి చేయనున్న ఫ్యామిలీ స్టార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?