AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barrelakka: లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్.. ఆ బలమైన నాయకుడికే పోటీగా..

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన వైపునకు తిప్పుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు.

Barrelakka: లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్.. ఆ బలమైన నాయకుడికే పోటీగా..
Barrelakka Alias Karne Sirisha
Basha Shek
|

Updated on: Apr 23, 2024 | 6:26 PM

Share

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన వైపునకు తిప్పుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖులు తనకు సపోర్టు ఇచ్చారంటే బర్రెలక్కకు ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చ. కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా దూసుకెళ్లారామె. అయితే ఎన్నికల్లో బర్రెలక్కకు కేవలం 5, 754 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎన్నికల్లో ఓటమి పాలైనా సరే నిరుద్యోగుల తరపున తన పోరాటం ఆపనంటూ బర్రెలక్క అప్పుడే ప్రకటించింది. అయితే మధ్యలో తన స్నేహితుడు, సమీప బంధువు వెంకటేశ్‌తో పెళ్లిపీటలెక్కింది సోషల్ మీడియా సెన్సేషన్. దీంతో బర్రెలక్క ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయిపోతుందని చాలా మంది భావించారు. అయితే ముందు చెప్పినట్టుగానే లోక్ సభ ఎన్నికల బరిలో కూడా నిలిచింది.

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రత్యర్థిగా బరిలోకి..

ఈ మేరకు మంగళవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది శిరీష. ఎలాంటి హడావుడి, లేకుండా.. కేవలం తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

 భర్తతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తోన్న బర్రెలక్క.. వీడియో ఇదిగో..

కాగా ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. గతంలో బర్రెలక్కకు ఆర్ఎస్పీ గట్టిగా మద్దతు తెలిపారు. బీఎస్పీలోకి రావాలని కూడా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రత్యర్థిగా బర్రెలక్క పోటీకి దిగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

యుద్ధం మొదలైంది.. లోక సభ ఎన్నికల ప్రచారంలో బర్రెలక్క.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.