“ఎనిమిది సినిమాల నుంచి త‌ప్పించారు, ఎంతో ఏడ్చా”

ఎనిమిది సినిమాల నుంచి త‌ప్పించారు, ఎంతో ఏడ్చా

తాను నటించిన మొద‌టి చిత్రం ఆగిపోవడంతో దురదృష్టవంతురాలనే ముద్ర వేసిన‌ట్లు తెలిపారు విద్యాబాలన్‌. ఆ తర్వాత‌ చాలా సినిమాల నుంచి తనను తప్పించి ఆ ప్లేసుల్లో వేరే హీరోయిన్స్‌ని తీసుకున్నారని వివ‌రించారు.

Ram Naramaneni

|

Aug 10, 2020 | 8:17 AM

 Bollywood actress Vidya Balan : తాను నటించిన మొద‌టి చిత్రం ఆగిపోవడంతో దురదృష్టవంతురాలనే ముద్ర వేసిన‌ట్లు తెలిపారు విద్యాబాలన్‌. ఆ తర్వాత‌ చాలా సినిమాల నుంచి తనను తప్పించి ఆ ప్లేసుల్లో వేరే హీరోయిన్స్‌ని తీసుకున్నారని వివ‌రించారు. కెరీర్‌ తొలిరోజుల్లో తనకు ఎదురైన అనుభవాలపై విద్యాబాలన్ మాట్లాడారు.

‘నా మొద‌టి సినిమాను మలయాళంలో సైన్ చేశా. ఆ మూవీలో మోహన్‌లాల్ హీరో. ఫ‌స్ట్ చిత్రంలోనే అగ్రహీరోతో నటించే ఛాన్స్ రావడంతో చాలా ఆనందప‌డ్డా. మొద‌టి షెడ్యూల్ కంప్లీట్ అయ్యేలోపు‌ మరో ఏడెనిమిది సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కొన్ని కారణాల వ‌ల్ల‌ మోహన్‌లాల్‌తో చేస్తోన్న‌ సినిమా ఆగిపోవడంతో నా పరిస్థితి మొత్తం చిన్నాభిన్నం అయింది. దురదృష్టవంతురాలినని నాపై ముద్ర వేశారు. అంత‌కుముందు ఓకే చేసిన సినిమాల నుంచి నన్ను తప్పించారు. నా ప్లేసులో ఇత‌ర హీరోయిన్స్‌ను తీసుకోవడంతో ఎన్నో రోజులు బాధ‌ప‌డ్డాను. ఏమి చెయ్య‌కుండా చాలా రోజులో ఖాళీగా ఉన్నా. ఆ సమయంలో ఇంట్లోనే కూర్చొని జ‌రిగినదాన్ని తల్చుకుంటూ ఏడ‌వకుండా, పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాడమని అమ్మ ఇచ్చిన సలహా నాలో మళ్లీ నూత‌నుత్సాహాన్ని నింపింది. హిందీ చిత్రం ‘పరిణీత’ హిట్ అవ్వ‌డంతో నా కష్టాలన్నీ తొలగిపోయాయి’ అని విద్యాబాలన్ తెలిపింది.

Also Read : కాస్త రిలీఫ్ : స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌ !

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu