ఇద్దరు బ‌డా నిర్మాతలతో సాయి తేజ్ సినిమా !

ఇద్దరు బ‌డా నిర్మాతలతో సాయి తేజ్ సినిమా !

ఇండ‌స్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎంట్రీ ఈజీ అవుతుంది. అంతేకానీ స్టార్ అవ్వాలంటే స్వ‌త‌హాగా స‌త్తా చాటాల్సిందే. ఈ విష‌యం నిజ‌మ‌ని చెప్ప‌డానికి తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా ఉదాహార‌ణ‌లు ఉన్నాయి.

Ram Naramaneni

|

Aug 10, 2020 | 7:51 AM

Sai Dharam Tej Next Movie : ఇండ‌స్ట్రీలో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎంట్రీ ఈజీ అవుతుంది. అంతేకానీ స్టార్ అవ్వాలంటే స్వ‌త‌హాగా స‌త్తా చాటాల్సిందే. ఈ విష‌యం నిజ‌మ‌ని చెప్ప‌డానికి తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా ఉదాహార‌ణ‌లు ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరో సాయి తేజ్ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మొదట్లో విజ‌యాలు ప‌ల‌క‌రించినా, ఆ త‌ర్వాత వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఇబ్బందులు ప‌డ్డాడు. ఆ త‌ర్వాత చిత్ర‌ల‌హ‌రి, ‘ప్రతిరోజు పండగే’ సినిమాల‌తో తిరిగి ట్రాక్‌లోకి వ‌చ్చాడు. తాజాగా ఈ మెగా హీరో నెక్ట్స్ మూవీ గురించి ఆస‌క్తిక‌ర అప్‌డేట్ స‌ర్కులేట్ అవుతుంది. ఇద్ద‌రు టాలీవుడ్ బడా ప్రొడ్యూస‌ర్లు సాయితో సినిమా నిర్మించ‌నున్నార‌ట‌. ఇటీవ‌ల ఓ కొత్త ద‌ర్శ‌కుడు తేజ్‌కు క‌థ చెప్ప‌గా, విప‌రీతంగా న‌చ్చిందని స‌మాచారం.

అయితే ప‌లు చిత్రాల‌ను ఇప్ప‌టికే ట్రాక్‌లో పెట్టిన సాయి.. 2022లోనే ఈ చిత్రాన్ని సెట్స్​పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక్క‌డ చెప్పుకోవాల్సిన విష‌యం ఏంటంటే..సాయి తేజ్​ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ తొలి మూవీకి దిల్​రాజు నిర్మాత కాగా, ప్ర‌స్తుతం చేస్తోన్న‌ ‘సోలో బతుకే సో బెటరు’ సినిమాను బీవీఎస్ఎన్​ ప్రసాద్ నిర్మిస్తున్నారు .

Also Read : కాస్త రిలీఫ్ : స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌ !

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu