మెగాస్టార్ బర్త్‌డేకు అభిమానుల అదిరిపోయే ప్లాన్‌

మెగాస్టార్ బర్త్‌డేకు అభిమానుల అదిరిపోయే ప్లాన్‌

మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 22న 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 09, 2020 | 10:04 PM

Megastar Chiranjeevi Birthday Celebrations: మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 22న 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలను గ్రాండ్‌గా చేయాలని మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ బర్త్‌డేకి చిరు కోసం కొంతమంది అభిమానులు అదిరిపోయే ప్లాన్ చేశారట. ఈ కాలంలో సెలబ్రిటీల పుట్టినరోజు సందర్భంగా కామన్‌ డీపీలను విడుదల చేస్తుండగా, చిరుకు కూడా అభిమానులు ఒకటి తయారు చేశారట. దీన్ని భారత సినీ ఇండస్ట్రీలో పేరు మోసిన 65 మంది సెలబ్రిటీల చేత విడుదల చేయించాలని వారు అనుకుంటున్నారట. ఈ క్రమంలో కామన్ డీపీకి సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభం కాగా.. ఆ మధ్యన ఓ టీజర్‌ కూడా రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ బర్త్‌డేకి చిరు కూడా అభిమానులకు పలు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: విజయవాడ అగ్ని ప్రమాదం: విచారణ కమిటీ ఏర్పాటు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu