Venkatesh’s Narappa: జోరు పెంచిన నారప్ప.. ఫస్టుకాపీ రెడీ చేస్తున్న చిత్రయూనిట్
కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్న హీరో ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్.
Venkatesh’s Narappa :
కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్న హీరో ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. సోలో సినిమాలైనా మల్టీస్టారర్ సినిమాలైనా వెంకటేష్ ముందుంటారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో చేస్తున్నాడు వెంకీ. అసురన్ సినిమాలో ధనుష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాదు ధనుష్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వెంకటేష్ మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియమణి నటిస్తున్నారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ కోసం వెంకీ పూర్తిగా తన లుక్ ను మార్చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా, ఫస్టుకాపీ రెడీ అవుతోందట. ఒక వారం రోజుల్లో ఫస్టుకాపీ వచ్చేస్తుందని అంటున్నారు. ఇక ఎప్పుడు విడుదల చేయనున్నారనేది త్వరలోనే ప్రకటిస్తారట. అందుకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు. ఒక సాధారణమైన రైతు తనకున్న కొద్దిపాటి భూమిని కాపాడుకోవడం కోసం చేసే పోరాటం నేపథ్యంలో సినిమా ఉండనుంది. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్ .. కలైపులి థాను కలిసి నారప్పను నిర్మిస్తున్నారు. మణిశర్మ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :