Venkatesh: మరో రీమేక్‌లో వెంకీమామ.. త్వరలోనే లైసెన్స్‌ తీసుకునే ఛాన్స్ !..

'దృశ్యం 2' సూపర్‌ డూపర్‌ హిట్‌తో 'రీమేక్‌ రారాజు' అని మరోసారి నిరూపించుకున్నారు విక్టరీ వెంకటేశ్‌. తన సినిమా కెరీర్‌లో ఇప్పటివరకు 25కు పైగా రీమేక్‌ చిత్రాల్లో నటించి విజయాలు సొంతం చేసుకున్న ఘనత

Venkatesh: మరో రీమేక్‌లో వెంకీమామ.. త్వరలోనే లైసెన్స్‌ తీసుకునే ఛాన్స్ !..
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2021 | 11:03 AM

‘దృశ్యం 2’ సూపర్‌ డూపర్‌ హిట్‌తో ‘రీమేక్‌ రారాజు’ అని మరోసారి నిరూపించుకున్నారు విక్టరీ వెంకటేశ్‌. తన సినిమా కెరీర్‌లో ఇప్పటివరకు 25కు పైగా రీమేక్‌ చిత్రాల్లో నటించి విజయాలు సొంతం చేసుకున్న ఘనత ఈ సీనియర్‌ హీరో సొంతం. కథ నచ్చితే చాలు ఇతర హీరోలతో కూడా స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరాయన. టాలీవుడ్‌లో ఇతర సీనియర్‌ హీరోలకు భిన్నంగా ముందుకు సాగుతున్న వెంకీమామ.. తాజాగా మరో రీమేక్‌ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మలయాళంలో విజయవంతమైన ‘డ్రైవింగ్ లైసెన్స్‌’ అనే చిత్రం తెలుగులో రీమేక్‌లో ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది.

2019లో విడుదలైన ‘డ్రైవింగ్ లైసెన్స్‌’ మంచి విజయం సాధించింది. ఓ స్టార్‌ హీరో, అతని అభిమాని అయిన ఆర్టీఓ అధికారి మధ్య ఊహించని విధంగా ఏర్పడిన ఇగో క్లాష్ వారి జీవితాలను ఎలా మలుపుతిప్పిందన్న పాయింట్‌తో దర్శకుడు లాల్ తనయుడు జీన్ పాల్ లాల్ ఈ కామెడీ యాక్షన్‌ డ్రామాను తెరకెక్కించారు. మలయాళంలో స్టార్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించగా, అతని అభిమాని, ఆర్టీఓ ఆఫీసర్ పాత్రను సూరజ్ వెంజరమూడు పోషించాడు. ఇప్పటికే అక్షయ్‌కుమార్‌ హీరోగా హిందీలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా కథ బాగుండడంతో గతంలోనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ఈ సినిమా రీమేక్‌ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. వెంకటేష్‌, రవితేజలు కలిసి నటిస్తారన్న వార్తలూ వచ్చాయి. అయితే చరణ్‌ వరుస సినిమాలతో బిజీగా మారిపోవడంతో ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ ను పట్టాలెక్కించడం ఆలస్యమైపోయింది. కాగా ఇప్పుడు ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ చరణ్‌ నుంచి గీతా ఆర్ట్స్‌ చేతికి మారిందని సమాచారం. వెంకీమామతోనే ఈ సినిమా తీయాలని గీతా ఆర్ట్స్‌ భావిస్తోందట . అయితే రవితేజ స్థానంలో మరో యువ హీరోను తీసుకుంటోందని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేశ్‌ ‘ఎఫ్‌ ‘తో పాటు ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. వాటి తర్వాతనే ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ కోసం వస్తారని తెలుస్తోంది.

Also Read:

Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..

avid Warner: దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసిన వార్నర్.. ఆర్సీబీకి ఆడాలంటోన్న నెటిజన్లు..

Samantha: జీవితం నాకు నేర్పిన గొప్ప పాఠం అదే.. సమంత పోస్ట్ వైరల్..