AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Luck Sakhi: రిలీజ్ డేట్ మార్చుకున్న గుడ్ లక్ సఖి.. కీర్తి సురేష్ మూవీ విడుదల ఎప్పుడంటే..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరనస నేను శైలజ సినిమాతా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను

Good Luck Sakhi: రిలీజ్ డేట్ మార్చుకున్న గుడ్ లక్ సఖి.. కీర్తి సురేష్ మూవీ విడుదల ఎప్పుడంటే..
Good Luck Sakhi
Rajitha Chanti
|

Updated on: Dec 06, 2021 | 9:21 AM

Share

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరనస నేను శైలజ సినిమాతా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో కిర్తీ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా సొంతం చేసుకుంది. మహానటి మూవీ తర్వాత కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఈ మూవీతోపాటు.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలుగా నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం గుడ్ లక్ సఖి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుహ్యా కారణాల వలన ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‏ను ప్రకటించింది చిత్రయూనిట్. గుడ్ లక్ సఖి సినిమాను డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. గుడ్ లక్ సఖి సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read:  Ram charan & Upasana: దోమకొండ కోటలో ఘనంగా పెళ్లి వేడుకలు.. సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఫోటోస్ వైరల్..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ షోలో ముగిసిన ప్రియాంక ప్రయాణం.. ఎంత పారితోషకం అందుకుందంటే..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!