AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shantipriya: 27 ఏళ్ల తర్వాత మళ్లీ మేకప్‌ వేసుకున్న భానుప్రియ చెల్లెలు.. త్వరలోనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ..

టాలీవుడ్ సీనియర్‌ నటి భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ 'మహర్షి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే

Shantipriya: 27 ఏళ్ల తర్వాత మళ్లీ మేకప్‌ వేసుకున్న భానుప్రియ చెల్లెలు.. త్వరలోనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ..
Basha Shek
|

Updated on: Dec 06, 2021 | 9:34 AM

Share

టాలీవుడ్ సీనియర్‌ నటి భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ ‘మహర్షి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పోషించిన ‘సుచిత్ర’ పాత్ర చాలామందికి గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ‘సింహస్వప్నం’, ‘యమపాశం’, ‘నాకు పెళ్లాం కావాలి’ తదితర సినిమాల్లో నటించి మెప్పించారు. తమిళ, హిందీ సినిమాల్లోనూ తన అభినయ ప్రతిభను చాటుకున్నారు. అయితే ఉన్నట్లుండి1994లో సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయారు శాంతి ప్రియ. ఆమె చివరిగా ‘ఇక్కేపే ఇక్కా’ అనే హిందీ చిత్రంలో నటించారు. కాగా సుమారు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ముఖానికి మేకప్‌ వేసుకున్నారీ సీనియర్‌ నటి. అది కూడా ఓ బాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌లో..

సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో హిందీలో ‘ధారావి బ్యాంక్’ అనే వెబ్ సిరీస్ రూపొందనుంది. సమిత్ కక్కడ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ను జీ స్డూడియోస్ నిర్మిస్తోంది. త్వరలోనే ‘ఎంఎక్స్‌ ప్లేయర్’ లో స్ట్రీమింగ్‌ కాబోతున్న ఈ వెబ్‌సిరీస్‌లో శాంతిప్రియ కీలక పాత్రలో నటించనున్నారు. ఆమెతో పాటు సోనాలీ కులకర్ణి, వివేక్ ఒబెరాయ్ తదితర ప్రముఖులు ఈ చిత్రంలో భాగం కానున్నారు. శాంతి విషయానికొస్తే.. 1994 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె 1999లో బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ రేను వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలకు అమ్మగా మారింది. అయితే 2004లోనే అనారోగ్య కారణాలతో ఆమె భర్త కన్నుమూశాడు. దీంతో తన ఇద్దరి పిల్లల పెంపకంలో బిజీగా మారిపోయారు. అయితే వారు పెరిగి పెద్ద కావడంతో మళ్లీ వెండితెరవైపు అడుగులేస్తున్నారామె.

Also Read:

Good Luck Sakhi: రిలీజ్ డేట్ మార్చుకున్న గుడ్ లక్ సఖి.. కీర్తి సురేష్ మూవీ విడుదల ఎప్పుడంటే..

Venkatesh: మరో రీమేక్‌లో వెంకీమామ.. త్వరలోనే లైసెన్స్‌ తీసుకునే ఛాన్స్..

David Warner: దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసిన వార్నర్.. ఆర్సీబీకి ఆడాలంటోన్న నెటిజన్లు..