David Warner: దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసిన వార్నర్.. ఆర్సీబీకి ఆడాలంటోన్న నెటిజన్లు..

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు బ్యాట్‌తో మెరుపులు మెరిపించడమేకాదు.. తన క్రియేటివిటీతో అభిమానులను మెప్పించడమూ తెలుసు. అతను గతంలో

David Warner: దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ను గుర్తు చేసిన వార్నర్.. ఆర్సీబీకి ఆడాలంటోన్న నెటిజన్లు..
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2021 | 8:34 AM

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు బ్యాట్‌తో మెరుపులు మెరిపించడమేకాదు.. తన క్రియేటివిటీతో అభిమానులను మెప్పించడమూ తెలుసు. అతను గతంలో పలు టిక్‌టాక్‌ వీడియోలతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలను అనుకరించి ఆకట్టుకున్న సంగతి తెలిఇసందే. ఇప్పుడు కొత్తగా ఫేస్‌యాప్‌ను ఉపయోగిస్తున్నాడు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో హీరోల ముఖాన్ని తీసేసి ..అందులో తన ఫేస్‌ను అతికించి డైలాగులు పేలుస్తున్నాడు. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టులో ఉన్నప్పుడు పలువురు తెలుగు హీరోల డైలాగులు, పాటలతో మెప్పించిన డేవిడ్.. తాజాగా కన్నడ పవర్‌స్టార్‌ దివంగత పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తు చేశాడు. అప్పు సినిమాలోని ఓ సీన్‌ను ఫేస్‌యాప్‌ సాయంతో రీక్రియేట్‌ చేసి రీల్‌ షేర్‌ చేశాడు. దీనికి ‘రెస్పెక్ట్‌’ అన్న హ్యాష్‌ట్యాగ్‌ను జోడించాడు.

ఆర్సీబీకి ఆడతారా..? కాగా గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఐపీఎల్‌ ట్రోఫీని సాధించిపెట్టిన వార్నర్‌ను ఆ జట్టు వదులుకున్న సంగతి తెలిసిందే. దీంతో త్వరలో జరిగే మెగా వేలంలో అతను పాల్గొననున్నాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తున్నాడీ స్టార్‌ క్రికెటర్‌. ఇందులో భాగంగా పునీత్‌ను గుర్తు చేస్తూ అతను షేర్‌ చేసిన పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ముఖ్యంగా కర్ణాటక, ఆర్సీబీ అభిమానులు లైకులు, లవ్, హార్ట్‌ ఎమోజీలతో కామెంట్‌ సెక్షన్‌ని నింపేస్తున్నారు. కాగా అప్పును గుర్తు చేయడంతో ఓ నెటిజన్‌ ‘ఆర్సీబీలో ఆడతారా’ అని అడగ్గా ‘స్మైలీ’ ఎమోజీలతో బదులిచ్చాడు వార్నర్‌.

Also Read:

Sara Tendulkar : నైట్‌ డేట్‌కు వెళ్లిన సచిన్‌ గారాల పట్టి.. వైరల్‌గా మారిన ఫొటోలు..

IND vs NZ: స్పైడర్‌ కెమెరాతో మ్యాచ్‌కు అంతరాయం.. టీమిండియా క్రికెటర్ల ఆటవిడుపు.. మీమ్స్‌తో చెలరేగిన నెటిజన్లు..

BWF World Tour Finals: ఫైనల్లో సింధుకు షాకిచ్చిన కొరియా ప్లేయర్.. మరోసారి టైటిల్ మిస్..!