AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Tendulkar : నైట్‌ డేట్‌కు వెళ్లిన సచిన్‌ గారాల పట్టి.. వైరల్‌గా మారిన ఫొటోలు..

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గారాల పట్టి సారా టెండూల్కర్‌, టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ డేటింగ్‌లో ఉన్నారని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు

Sara Tendulkar : నైట్‌ డేట్‌కు వెళ్లిన సచిన్‌ గారాల పట్టి.. వైరల్‌గా మారిన ఫొటోలు..
Basha Shek
|

Updated on: Dec 06, 2021 | 1:13 PM

Share

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గారాల పట్టి సారా టెండూల్కర్‌, టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ డేటింగ్‌లో ఉన్నారని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు. అందుకు తగ్గట్లే గిల్‌ షేర్‌ చేసే పోస్టులకు లైకులు, ఎమోజీలు, ఫన్నీ కామెంట్లతో సారా స్పందించడం.. గిల్ కూడా అంతే సరదాగా రిప్లైలు ఇస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. అయితే తమ రిలేషన్‌ విషయంపై ఇద్దరూ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఇటీవల ‘ఏంజెల్స్‌తో ప్రేమలో పడకూడదు’ అని ఒక కొటేషన్‌ రాసి ఉన్న టీ షర్ట్‌ ధరించి ఆ ఫొటోను షేర్‌ చేశాడు శుభ్‌మన్‌. దీంతో వీళ్లిద్దరు విడిపోయారేమోనని చాలామంది భావించారు. నెటిజన్లు కూడా ఆ పోస్టుపై రకరకాల కామెంట్లు చేశారు. ఈ క్రమంలో సారా తాజాగా షేర్‌ చేసిన ఓ పోస్టు మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది.

సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ వ్యక్తి చేయి పట్టుకుని ‘డేట్‌ నైట్‌’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు మళ్లీ తమ నోటికి పని చెప్పారు. ‘ గిల్‌ ముంబయి టెస్టు మ్యాచ్‌లో బిజీగా ఉంటే.. సారా మాత్రం నైట్‌ డేట్‌కి వెళ్లింది.. ఇంతకీ ఎవరా వ్యక్తి’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ బాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ కనికా కపూర్‌ సైతం ఇవే పోస్టులను ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో షేర్‌ చేసింది. సారాతో డేట్‌కు వెళ్లినట్లు చెప్పడంతో నెటిజన్లు శాంతించారు . కాగా ‘రాగిణి ఎంఎంఎస్‌’ సినిమాలోని ‘బేబీ డాల్‌’ పాటతో మంచి గుర్తింపు సాధించుకన్న కనికా ఆ మధ్యన కరోనా బారిన పడి ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Also Read:

IND vs NZ: స్పైడర్‌ కెమెరాతో మ్యాచ్‌కు అంతరాయం.. టీమిండియా క్రికెటర్ల ఆటవిడుపు.. మీమ్స్‌తో చెలరేగిన నెటిజన్లు..

Ashes Series: యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టుకు ప్లేయింగ్ XIని ప్రకటించిన ఆస్ట్రేలియా.. ఆ ప్లేయర్‌కు దక్కని చోటు..!

IND vs NZ, 2nd Test, Day 2 Highlights: మూడో రోజు ఆట ముగుస్తుంది.. న్యూజిలాండ్ 140/5 చేసింది.. ఇంకా ఎంత కొట్టాలో తెలుసా..