Chinmayi Sripada: కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేస్తారు.. అమ్మాయిలను స్వతంత్రంగా బతకనివ్వరు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్..

ప్రముఖ గాయనీ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రస్తుతం జరుగుతున్న విషయాలు..

Chinmayi Sripada: కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేస్తారు.. అమ్మాయిలను స్వతంత్రంగా బతకనివ్వరు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్..
Chinmayi
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2021 | 10:24 AM

ప్రముఖ గాయనీ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా పోరాడింది. అలాగే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రస్తుతం జరుగుతున్న విషయాలు.. ఆమ్మాయిలు ఎదుర్కోంటున్న సమస్యలపై తనదైన శైలీలో స్పందిస్తుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లపై జరుగుతున్న దాడులు.. వారు ఎదుర్కోంటున్న వేధింపులు.. అమ్మాయిల పెళ్లిళ్ల గురించి సోషల్ మీడియా ద్వారా సలహాలు ఇస్తుంటుంది చిన్మయి. అయితే ఎప్పటికప్పుడు అమ్మాయిలు.. వారి సమస్యలపై స్పందించే చిన్మయిని అనేక సార్లు కొందరు నెటిజన్స్ ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. అయితే వాటికి చాలా సార్లు స్ర్టాంగ్ ఆన్సర్ ఇస్తుంటుంది చిన్మయి. తాజాగా మరోసారి తన ఇన్‏స్టా ఖాతాలో అమ్మాయిల పెళ్లి గురించి స్పందించింది చిన్మయి.

తన ఇన్‏స్టా ఖాతాలో “డ్రంకెన్ డ్రైవింగ్.. ఓవర్ స్పీడింగ్ గురించి ఒక అవగాహన కార్యక్రమం ఉందని అనుకోండి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి చేయాలి, ఇవి చేయొద్దు అని చెబుతారు. అంటే ప్రతీ ఒక్కరు తాగి బండి నడుపుతున్నారని కాదు. అది ఎవరికి అవసరమో వారికే చెబుతున్నట్టు లెక్క. నేను పెడుతున్న స్టోరీస్ చూసి ఎన్ఆర్ఐస్ అందరూ అలా కాదు..జనరలైజ్ చేయకే… అని వాగనక్కర్లేదు. ఓ అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను అందరికీ చెబుతున్నాను. దీంతో మరో అమ్మాయి జాగ్రత్త పడుతుందని.. నాకేమో ఈ ఫారిన్ సంబంధం మోహం ఎప్పటికీ అర్థం కాదు. తమ బిడ్డకు గౌరవంగా బతికే ఛాన్స్ అస్సలు ఇవ్వరు. తన కాళ్ల మీద తను నిలబడే స్వేచ్చ ఇవ్వరెందుకో అని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటాను. కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేస్తారు.. కానీ అమ్మాయిలకు మాత్రం ఆర్థికంగా, స్వతంత్ర్యంగా బతకనివ్వరు.

అవన్నీ అయితే అమ్మాయిలకు అవగాహన, ఏజెన్సీ వస్తే వేరే కాస్ట్ వాళ్లను పెళ్లి చేసుకుంటారని భయం.. ఫోర్స్ చేసి వెధవనైనా పర్లేదు సొంత క్యాస్ట్‏లోనే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నాక కొట్టినా, తిట్టినా వాడితోనే కాపురం చేయాలి. అందరినీ జనరలైజ్ చేస్తున్నావ్..కొందరు ఆడవాళ్లు కూడా నువ్ చెప్పేదానికి అంగీకరించడం లేదు అని చెబుతున్న మనుషులకు.. ఈ పితృస్వామ్య వ్యవస్థను ఇంకా కొంత మంది మహిళలు సమర్థిస్తునే ఉన్నారు. ఇంకొందరు ఆడవాళ్లు కట్నాలు, వేధింపులపై మాట్లాడని వారున్నారు. ఈ స్టోరీస్ చూసి కొంతమంది అమ్మాయిలైనా సరే కట్నం ఇవ్వను అని నిర్ణయించుకుంటే కూడా అది నాకు చాలు. అవగాహన కల్పిస్తుంటే.. హిస్టారికల్‏గా చూస్తే కూడా మనుషులకు కోపం వస్తుంది. బాలికల విద్య నుంచి సతీ సహగమనం వంటి చెత్త సంప్రదాయాలను మార్చేందుకు చూసిన ప్రతిసారి ఇలాంటి కోపాన్నే ప్రదర్శించారు. అందరు అబ్బాయిలు తమ సోదరీమణులను ఇలానే చేస్తారా ? చేయనంటే.. వారంతా నాతో అంగీకరించినట్టే. మిగిలిన వాళ్లకు కోపం వస్తే కోప్పడండి మీ ఈగోలను సాటిఫై చేసి మిమ్మల్ని శాంతిపరిచేందుకు నేను రాలేదు ” అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది.

Also Read: Ananya Nagalla: ఎల్లో డ్రెస్‏లో అదిరిపోయిన వకీల్ సాబ్ ముద్దుగుమ్మ.. అనన్య నాగళ్ల ఫోటోలకు కుర్రకారు షాక్..