Priyanka Singh: మానస్, కాజల్ వీడియో చూపించిన అరియానా.. మానస్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ప్రియాంక ఎమోషనల్..
బిగ్ బాస్ సీజన్ 5.. పదవ మూడవ ఎలిమినేట్ అయ్యింది ప్రియాంక సింగ్. పింకీ ఎలిమినేషన్ గురించి ముందుగానే సోషల్ మీడియాలో
బిగ్ బాస్ సీజన్ 5.. పదవ మూడవ ఎలిమినేట్ అయ్యింది ప్రియాంక సింగ్. పింకీ ఎలిమినేషన్ గురించి ముందుగానే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 19 మందితో మొదలైన గేమ్ లో ఇప్పుడు ఆరు మంది మిగిలారు. సన్నీ, మానస్, శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సిరి, కాజల్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇక ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన ప్రియాంక అరియానాతోపాటు బిగ్ బాస్ బజ్ లో పాల్గోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఇక అరియానా ఇచ్చిన టాస్కులో డౌన్ తంబ్ సింబల్ కాజల్‌కు ఇవ్వగా.. లవ్ సింబల్ శ్రీరామచంద్రకు ఇచ్చింది. ఇక పంచ్ సింబల్ మాత్రం మానస్‌కు ఇచ్చి షాకిచ్చింది పింకీ. అలా ఎందుకు అని అరియానా అడగ్గా.. ఏదైనా ఉంటే నాతో మాట్లాడోచ్చు కదా అంటూ సమాధానమిచ్చింది. ఇక పింకీ అంటే మానస్ గుర్తోస్తాడని అరియానా చెప్పగా.. మానస్ గేమ్ నేను ఆడితే ఇక మా ఇద్దరికి ఓకే ట్రోఫీ ఇచ్చేయ్యొచ్చు కదా అంటూ బదులిచ్చింది పింకీ. కాజల్ మీద మీ ఫీలింగ ఏంటీ.. తన ఆట ఎలా ఉంటుంది అని అరియానా అడగ్గా.. ప్రతి విషయాన్ని గొడవ పెంచుతుందని అనిపిస్తుంటుంది అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. అలాగే షణ్ముఖ్ సైలెంట్ కిల్లర్ అని.. స్ట్రాంగ్ అని.. టాస్కులలో తను చేయాలనుకున్నది ఎలాగైనా చేసేస్తాడని చెప్పింది. ఇక రవి..తను బ్రదర్ అండ్ సిస్టర్ మాదిరిగా ఉండేవాళ్లమని.. రవి ఉంటే ఏదో తెలియని ధైర్యం ఉండేదని చెప్పుకొచ్చింది.
ఇక టైటిల్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారని అడగ్గా.. మానస్ అంటూ బదులిచ్చింది పింకీ. దీంతో మానస్, కాజల్.. ప్రియాంక గురించి వీడియోను చూపించి షాకిచ్చింది అరియానా. ఆ వీడియో చూసి షాకైన పింకీ.. మానస్ చాలా సారీ.. ఇది నీ నుంచి నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు అంటూ చెప్పుకోచ్చింది. మానస్‌కు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడగ్గా.. మానస్ గురించి నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే.. ఎవరినైనా చదివి పక్కనపెట్టేస్తాడు. నాకు పిల్లలుంటే ఎలా చూసుకునేదాన్నో అలాగే చూసుకుంటానంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. ఇదిలా ఉంటే టాప్ 5లో ఉండాల్సిన ప్రియాంక.. ఇలా ఆకస్మాత్తుగా ఎలిమినేట్ కావడం నిరాశ కలిగించిదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.