Samantha: జీవితం నాకు నేర్పిన గొప్ప పాఠం అదే.. సమంత పోస్ట్ వైరల్..

సమంత.. తిరిగి వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఓవైపు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్

Samantha: జీవితం నాకు నేర్పిన గొప్ప పాఠం అదే.. సమంత పోస్ట్ వైరల్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2021 | 8:15 AM

సమంత.. తిరిగి వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఓవైపు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు స్పెషల్ సాంగ్స్ కూడా ఓకే చెప్పేస్తుంది. టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, హాలీవుడ్ ఆఫర్లను కూడా సామ్ అందుకున్నట్లుగా సమాచారం. విడాకుల అనంతరం కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టిన సమంత.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. మోటీవేషనల్ కోట్స్.. లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూనే అభిమమానులతో టచ్‏లో ఉంటుంది సామ్. ఇక సమంత చేసిన ప్రతి పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎలాంటి పోస్ట్ పెడుతుంది.. సామ్ చేసే కోట్స్ గురించి నెట్టింట్లో చర్చలు జరుగుతుంటాయి.

గత కొద్ది రోజులుగా మై మామ్ సేడ్ అనే హ్యాష్ ట్యా్గ్‏తో తన మనసులోని భావాలను.. అనుభూతులను చెప్పే ప్రయత్నం చేస్తుంది సమంత. దీంతో సామ్ ఫాలోవర్స్ సంఖ్య కూడా భారీగానే పెరిగిపోయింది. ఇటీవలే సమంత ఇన్‏స్టా ఫాలోవర్స్ సంఖ్య 2 కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సామ్ తన ఇన్‏స్టా స్టోరీలో పోస్ట్ చేసిన కోట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ” జీవితం నాకు నేర్పిన గొప్ప పాఠం ఏంటంటే.. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది ” అంటూ సమంత తన ఇన్‏స్టాలో షేర్ చేసింది. అలాగే అమెరికన్ రైటర్ చెరిల్ సాట్రయ్డ్ రచించిన కొటేషన్‏ను కూడా యాడ్ చేసింది.

Samantha

Samantha

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను పూర్తిచేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తమిళంలో కాతు వాకుల్ రెండు కాదల్ అనే సినిమాలోనూ నటిస్తోంది. ఇక అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న పుష్ప సినిమాలో సామ్ స్పెషల్ సాంగ్‏లో చిందులేయనుంది.

Also Read:  Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ షోలో ముగిసిన ప్రియాంక ప్రయాణం.. ఎంత పారితోషకం అందుకుందంటే..

Bigg Boss 5 Telugu: పింకీ టాప్‌ 5 లిస్టులో ఉండాల్సింది.. ఫీల్ అవుతున్న అభిమానులు.. సోషల్ మీడియాలో హల్‌చల్