Bigg Boss 5 Telugu: పింకీ టాప్‌ 5 లిస్టులో ఉండాల్సింది.. ఫీల్ అవుతున్న అభిమానులు.. సోషల్ మీడియాలో హల్‌చల్

బిగ్ బాస్‌ లో ఓ పక్క సిరి, షణ్ముఖ్ ట్రాక్‌ నడుస్తుంటే.. మరో పక్క మానస్‌, ప్రియాంక ట్రాక్‌ నడుస్తూ.. బీబీ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుండేది.

Bigg Boss 5 Telugu: పింకీ టాప్‌ 5 లిస్టులో ఉండాల్సింది.. ఫీల్ అవుతున్న అభిమానులు.. సోషల్ మీడియాలో హల్‌చల్
Priyanka
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 05, 2021 | 9:25 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్‌ లో ఓ పక్క సిరి, షణ్ముఖ్ ట్రాక్‌ నడుస్తుంటే.. మరో పక్క మానస్‌, ప్రియాంక ట్రాక్‌ నడుస్తూ.. బీబీ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుండేది. కాని ఇప్పుడీ ట్రాక్‌కు తాజాగా బిగ్ బాస్‌ పులిస్టాప్‌ పెట్టాడు. ఈ జంటను తాజా వీక్‌ లో విడగొట్టాడు. ప్రేక్షకుల ఓట్లనే ఆయుధంతో.. ప్రియాంకను ఎలిమినేట్ చేశాడు. మానస్‌ విన్నింగ్‌ రూట్ను క్లియర్ చేశాడు. రెండు మూడు రోజుల నుంచే టాస్కుల రూపంలో ఈ జోడీ మధ్య చిచ్చుపెట్టిన బిగ్ బాస్‌.. ఇప్పుడు ప్రియాంకను ఇంటి నుంచి బయటికి పంపించాడు. అయితే ఈవారం పోలైన ఓట్లలో ప్రియంకకే తక్కువ ఓట్లు రావడంతో.. బిగ్ బాస్‌ ఈ వారం ఈ లేడీని బయటికి పట్టుకొచ్చాడు.

అయితే ఈ వారం ఆర్జే కాజల్ బిగ్‌ బాస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్టే కాజల్‌ కూడా గేమ్‌లో అంటీ ముట్టనట్టే ఉంది. ఎప్పటి లానే కంటెస్టెంట్స్ మధ్య చిచ్చులు పెడుతూ లేడీ నారథుడిలా వ్యవహరించింది. ఎప్పుడూ మాట్లాడుతూ అటు షో చేసేవారిని ఇటు షో లో ఉన్నవారిని ఇరిటేట్‌ చేసింది. దీంతో ఈ ఆర్జే వెళ్లిపోవడం లాంచనమే అని అంతా అనుకున్నారు. కాని చివర్లో కాజల్‌ వ్యతిరేకులకు ట్విస్ట్ ఇచ్చిన ఫాలోవర్స్ … ఆమె ఓటింగ్ మీటర్ను అమాంతం పెంచేశారు. కాజల్ ను బచాయించారు. ఇక ప్రియాంక ఎలిమినేట్ అవడంతో… పింకీ అభిమానులు ఫీలవుతున్నారు. పింకీ టాప్‌ 5 లిస్టులో ఉండాల్సింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక యాంటీ పింకీ ఫ్యాన్స మాత్రం మానస్‌కు ఇక విముక్తే మీమ్స్‌ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda: ‘అఖండ’పై అన్షుల్ సక్సేనా ప్రశంసలు.. ‘జై బాలయ్య’ అని కామెంట్..

Pushpa Movie: పుష్ప మేకింగ్‌ వీడియోను చూశారా.? బన్నీ ఇచ్చిన మెసేజ్‌ మాత్రం అదుర్స్‌..

Akira Nandan: తల్లి కోరికను తీర్చిన అకిరా.. తన పుట్టిన రోజుకి వెలకట్టలేని బహుమతి అంటున్న రేణు దేశాయ్..