AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలితరం నటి క్రృష్ణ వేణి బ్యాగ్రౌండ్.. ఆమె మీర్జాపురం రాణి అని మీకు తెలుసా.?

ప్రముఖ నటి, సీనియర్ నిర్మాత కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా.. కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. సీనియర్ హీరో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను సినీరంగానికి హీరోగా పిరచయం చేశారు కృష్ణవేణి. ఆమె నిర్మించిన మనదేశం చిత్రంలో ఎన్టీఆర్ చిన్న పాత్ర పోషించారు.

తొలితరం నటి క్రృష్ణ వేణి బ్యాగ్రౌండ్.. ఆమె మీర్జాపురం రాణి అని మీకు తెలుసా.?
Krishnaveni
B Ravi Kumar
| Edited By: |

Updated on: Feb 17, 2025 | 9:17 AM

Share

నూజివీడు అంటే ముందుగా గుర్తొచ్చేది నోరూరించే తీయని మామిడి పండ్లు.. నూజివీడు మామిడి అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందింది. నూజివీడు అంటే కేవలం మామిడి పండ్లకే కాదు కళలకు పుట్టినిల్లుగా కూడా చెప్పుకోవచ్చు. నూజివీడులో తయారయ్యే వీణలు ఇప్పటికే ఎంతో గుర్తింపు తెచ్చుకుని ఎన్నో అవార్డులు పొందాయి. ఇంకా నూజివీడు గురించి ప్రధానంగా చెప్పుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. తొలి తరం తెలుగు సినిమా నటీనటులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వారు ఉన్నారు. అంతేకాకుండా ఎంతో వైభవోపేతంగా ఉండే ఎస్టేట్లు, కోటలు నూజివీడుకు ఎంతో ప్రాధాన్యత తీసుకువచ్చాయి.

అయితే ఇప్పుడు మనం ఎందుకు నూజివీడు గురించి చర్చించుకుంటాను అనేగా మీ సందేహం. నూజివీడు కు చెందిన మీర్జాపురం ఎస్టేట్ రాణి తెలుగు సినీ పరిశ్రమ తొలి తరం నటి కృష్ణవేణి (102) వయోబారంతో ఫిబ్రవరి 16న మృతి చెందారు. ఆమె మృతికి నూజివీడుకు చెందిన ప్రముఖులే కాక ఎంతోమంది సంతాపం తెలిపారు. నూజివీడు సంస్థానానికి చెందిన మీర్జాపురం కోటను 1934 సంవత్సరంలో రాజా మేక వెంకట రామ అప్పారావు రామయ్య అనే రాజా వారు కట్టించారు. ఆయన సతీమణి కృష్ణవేణి. ఆమె తెలుగు సినీ పరిశ్రమకు తొలితరం నటి. ఎన్నో సినిమాలలో ఆమె నటించారు. అయితే ప్రస్తుతం ఆమెకు102 సంవత్సరాల వయసు ఉండడంతో వయోభారంతో మృతి చెందారు. ప్రస్తుతం మీర్జాపురం ఎస్టేట్లో డిగ్రీ కళాశాల కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. 90 సంవత్సరాలు గల మీర్జాపురం ఎస్టేట్ ఎంతో బలిష్టంగా ఉండి ఇప్పటికీ అందులోని గోడలు ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి అంటేనే తెలుస్తుంది దానిని ఎంత దృఢంగా నిర్మించారు అనే విషయం… గతంలో ఈ ఎస్టేట్లో గురుకుల పాఠశాలను నడిపేవారు. ఆ తరువాత విద్యుత్ కార్యాలయాన్ని కొన్ని సంవత్సరాలు రన్ చేశారు. అలాగే న్యాయస్థానాన్ని కూడా కొన్ని రోజులు పాటు అక్కడ కొనసాగించారు. 2010 సంవత్సరం నుంచి ఆ భవనంలో శారద డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు. అయితే నూజివీడులో ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండటంతో ఇపుడు నూజివీడు పేరు చెబితేనే ఫేమస్గా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి