AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Thottempudi: ఆ స్టార్ హీరోను నమ్మి లక్షల్లో నష్టపోయాను.. అసలు విషయం చెప్పిన వేణు

స్వయంవరం సినిమా తర్వాత వేణు వరుసగా సినిమాలు చేశారు. మనసుపడ్డాను కానీ, చిరునవ్వుతో, వీడెక్కడి మొగుడండి?, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి ఇలా చాలా సినిమాల్లో నటించారు వేణు.

Venu Thottempudi: ఆ స్టార్ హీరోను నమ్మి లక్షల్లో నష్టపోయాను.. అసలు విషయం చెప్పిన వేణు
Venu
Rajeev Rayala
|

Updated on: Nov 14, 2024 | 4:29 PM

Share

వేణు తొట్టెంపూడి.. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు ఈ టాల్ హీరో.. 1999లో వచ్చిన స్వయంవరం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు వేణు. ఈ సినిమాలో లయ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే లయ కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. స్వయంవరం సినిమా తర్వాత వేణు వరుసగా సినిమాలు చేశారు. మనసుపడ్డాను కానీ, చిరునవ్వుతో, వీడెక్కడి మొగుడండి?, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి ఇలా చాలా సినిమాల్లో నటించారు వేణు. సోలో హీరోగా రాణించిన వేణు సెకండ్ హీరోగానూ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు వేణు విలన్ గా మారి సినిమాలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

ఇటీవలే రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించారు. ఈ మధ్యకాలంలో వేణు సినిమాలు తగ్గించారు. వేణు సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ముఖ్యంగా వేణు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేది. ఇదిలా ఉంటే ఓ హీరో వల్ల తాను రూ. 14 లక్షలు నష్టపోయానని అన్నారు వేణు. ఈ హీరో ఎవరో కాదు ఒకప్పుడు హీరోగా రాణించి ఇప్పుడు విలన్ గా ఆకట్టుకుంటున్న జగపతి బాబు.

ఇది కూడా చదవండి :Tollywood : చేసింది 12 సినిమాలు.. హిట్ అయ్యింది మాత్రం రెండే.. చివరకు ఇలా

గతంలో వేణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జగపతి బాబు నేను చాలా సరదాగా ఉండే వాళ్ళం.. ఆయనతో నేను హనుమాన్ జంక్షన్, ఖుషి ఖుషీగా సినిమాలు చేశాను. హనుమాన్ జంక్షన్ సినిమా చూసిన తర్వాత మొత్తం నువ్వే దొబ్బేశావ్ గా అని సరదాగా అనేవారు. ఆయనకు నాకు మంచి రిలేషన్ ఉంది. నాకు ఎవరితో ఎలాంటి గొడవలు లేవు. నాకు సినిమా తప్ప ఏమీ తెలియదు. కానీ ఓ సంఘటన అనుకోకుండా జరిగింది. ఓ వ్యక్తికి నేను జగపతి బాబును నమ్మి రూ. 14లక్షలు ఇచ్చాను.. ఆ డబ్బు అతను తిరిగి ఇవ్వలేదు అని అన్నారు. వేణు మాట్లాడుతూ.. ఓ వ్యక్తి అవసరం ఉంది అని నన్ను రూ. 14 లక్షలు కావాలి అని అడిగాడు.. దానికి జగపతి బాబు మధ్యలో ఎంటర్ అయ్యి హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చారని నేను అతనికి రూ. 14లక్షలు ఇచ్చాను. కానీ ఆ వ్యక్తి ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. ఆ టైంలో నాకు అది చాలా పెద్ద అమౌంట్. జగపతి బాబు కూడా తర్వాత ఆ డబ్బు ముట్టిందా.? లేదా అని అడగలేదు. ఇది జరిగి చాలా కాలం అయ్యింది. ఆతర్వాత నేను ఆయనతో ఇంతవరకు మాట్లాడలేదు.. కలవలేదు.. అని అన్నారు వేణు. దాని గురించి మాట్లాడటం కూడా తనకు ఇష్టం లేదు అని అన్నారు వేణు. గతంలో వేణు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.