Prasanth Varma: హాట్ బ్యూటీకి అదిరిపోయే ఆఫర్.. హనుమాన్ డైరెక్టర్ సూపర్ ఉమెన్ ఈమె..

డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ హిట్స్ అందుకుంటున్నాడు ఈ కుర్రదర్శకుడు. అ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Prasanth Varma: హాట్ బ్యూటీకి అదిరిపోయే ఆఫర్.. హనుమాన్ డైరెక్టర్ సూపర్ ఉమెన్ ఈమె..
Prashanth Varma
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 13, 2024 | 2:34 PM

ప్రశాంత్ వర్మ.. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ హిట్స్ అందుకుంటున్నాడు ఈ కుర్రదర్శకుడు. అ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాగే 2021లో వచ్చిన జాంబీ రెడ్డి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన తేజ హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక తమన్నా ప్రధాన పాత్రలో దట్ ఈజ్ మహాలక్ష్మీ అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

ఇది కూడా చదవండి : Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఆ హీరోయినా..! జ్యోతిక మాత్రం కాదు

ఇక ఈ ఏడాది హనుమాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలను లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో తేజ సజ్జ కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి : S. S. Rajamouli: రాజమౌళికి బాగా నచ్చిన నటి.. సావిత్రి, అనుష్క అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

జై హనుమాన్ సినిమాతో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు. ఇటీవలే ఆయనకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు.  ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మరికొన్ని సినిమాలను కూడా తెరకెక్కించనున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. కాగా వాటిలో ఓ సూపర్ ఉమెన్ సినిమా కూడా ఉండనుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా ఓ హాట్ బ్యూటీ నటిస్తుంది. ఆమె పేరు జ్ఞానేశ్వరి . ఈ అమ్మడు మిస్టర్ అండ్ మిస్, ఏమి సేతుర లింగ, మంత్ ఆఫ్ మధు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడిని ప్రధాన పాత్రలో పెట్టి ప్రశాంత్ వర్మ ఓ సూపర్ ఉమెన్ సినిమా చేస్తున్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్నీ తెలిపింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ హాట్ బ్యూటీ ఫోటోలకుకుర్రకారు ఫిదా అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!