AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: సల్మాన్ ఖాన్ వస్తున్నాడని పుకార్లు.. వెర్రెక్కి హోటళ్ల ముందు క్యూ కట్టిన జనం

మామూలుగానే మనవాళ్లకు సినిమా వాళ్లంటే అదొక రకమైన పిచ్చి పెంచేసుకుని ఉంటారు. అదిగో దాన్నే మంచి అవకాశంగా మలుచుకుని తమ వ్యాపారం చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. పాతబస్తీలోని ఓ హోటల్‌కు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వస్తున్నాడని పబ్లిసిటీ చేశారు.

Salman Khan: సల్మాన్ ఖాన్ వస్తున్నాడని పుకార్లు.. వెర్రెక్కి హోటళ్ల ముందు క్యూ కట్టిన జనం
Salman Khan
Noor Mohammed Shaik
| Edited By: Rajeev Rayala|

Updated on: Nov 13, 2024 | 2:03 PM

Share

ఊరికే వ్యాపారం చేస్తే సరిపోదు.. జనాలను రప్పించేలా తెలివితో వ్యాపారం చేయడమే ముఖ్యం అనుకున్నారు వీళ్లు. అందుకే ప్రజలను వెర్రివాళ్లను చేసేలా ఒక ఆలోచన చేశారు. మామూలుగానే మనవాళ్లకు సినిమా వాళ్లంటే అదొక రకమైన పిచ్చి పెంచేసుకుని ఉంటారు. అదిగో దాన్నే మంచి అవకాశంగా మలుచుకుని తమ వ్యాపారం చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. పాతబస్తీలోని ఓ హోటల్‌కు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వస్తున్నాడని పబ్లిసిటీ చేశారు. ఇంకేముంది.. జనాలు ఎగబడ్డారు.. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు చూద్దామా..!

ప్రశాంతంగా అందరూ నిద్రపోతున్న సమయంలో సల్మాన్ ఖాన్ మండి తినడానికి వస్తున్నాడని ఓ వార్త పాతబస్తీని కుదిపివేసింది. పాత బస్తీలో ఉన్న హోటళ్లలో కాంపిటీషన్ పెరిగిపోయింది. ఏం చేయాలా అని ఆలోచించి కొందరు ఆగంతకుల ద్వారా సల్మాన్ వస్తున్నాడని పుకార్లు సృష్టించి ఫ్రీ పబ్లిసిటీ చేయించుకున్నారు హోటల్ యాజమాన్యం. దీంతో వెర్రెక్కిన జనం వందలాదిగా తరలివచ్చి హోటళ్ల ముందు సల్మాన్ వస్తాడని చూస్తూ నిరీక్షించారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో వస్తాడా అని ఎదురుచూడడం కొందరు.. మిగతా జనాలని చూసి మనమూ కాసేపు ఉండి సల్మాన్ ను చూసే వెళ్దాం అని మరికొందరు.. వస్తే ఊరికే ఉండాలా అనుకుని ఇష్టం లేకపోయినా ఆర్డర్ చేసుకుని మండి తిన్నవాళ్లు ఇంకొందరు.. ఇలా మొత్తానికి వ్యాపారం బాగానే సాగింది పాతబస్తీ ప్రాంతమంతా.

పైగా అప్పటివరకు నిరీక్షించిన కస్టమర్లతో అసలు సల్మాన్ వస్తున్నాడని ఎవరు చెప్పారు అంటూ హోటల్ యాజమాన్యం ఎదురు ప్రశ్నలు వేయడంతో తల బాదుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో చేసేదేం లేక కస్టమర్లు తీవ్ర ఆందోళనకు గురై తిన్నదానికి బిల్లు కట్టి చేయి కడుక్కుని తిరిగి వెళ్లిపోవడమే దిక్కయింది. మరోవైపు.. రాత్రంతా అమ్ముకుని వ్యాపారం చేసుకోవాల్సిందంతా గంట లోపే అయిపోవడంతో హోటల్ నిర్వాహకులు కూడా షాపులు మూసేసి వెళ్లిపోయారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.