- Telugu News Photo Gallery Cinema photos How much has Lucky Bhaskar movie collected at the box office so far?
Lucky Bhaskar: లక్కీ బాస్కర్ వసూళ్ల సునామి.. ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందంటే.?
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం లక్కీ బాస్కర్. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. రెండు వారలగా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా. అయితే ఈ మూవీకి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్ ఎంత.? ఆక్యుపెన్సీ ఎంత శాతం.? ఇలాంటి వార్తలు తెలుసుకుందాం..
Updated on: Nov 13, 2024 | 2:40 PM

సోమవారం ‘లక్కీ బాస్కర్’ తెలుగులో రూ.75 లక్షలు, తమిళనాడు నుంచి రూ.60 లక్షలు, కేరళ నుంచి రూ.40 లక్షలతో రూ.1.75 కోట్లు వసూలు చేసింది. ఇది 12వ రోజు వసూళ్లు. 13 రోజు వసూళ్లు కూడా దూసుకుపోతున్నాయి.

దుల్కర్ సల్మాన్ నటించిన ఈ చిత్రం నవంబర్ 12 మంగళవారం నాడు మార్నింగ్ షోలు 12.76 శాతం, మధ్యాహ్నం షోలు 18.35 శాతం, ఈవినింగ్ షోలు 16.43 శాతం, నైట్ షోలు 21.79 శాతంతో మొత్తం 17.33 శాతం తెలుగు ఆక్యుపెన్సీని కలిగి ఉంది.

‘లక్కీ బాస్కర్’ విడుదలైన13 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్స్‌లో రూ. 57.90 కోట్లు వసూలు చేసింది. వెబ్‌సైట్ తొలి అంచనాల ప్రకారం చిత్రం 13 రోజున రూ. 1.65 కోట్లు వసూలు చేసింది.

ఇటీవల విడుదలైన దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'లక్కీ బాస్కర్' చిత్రం 70 కోట్ల రూపాయల వసూళ్లుతో ప్రభంజనం సృష్టించింది. దీంతో ఆగకుండా 80 కోట్ల వైపుగా దూసుకుపోతుంది ఈ చిత్రం.

‘లక్కీ బాస్కర్’ మొత్తం తమిళ ఆక్యుపెన్సీ 21.33 శాతం మరియు దుల్కర్ హోమ్ గ్రౌండ్ కేరళలో 14.05 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉంది. అయితే నవంబర్ 14న కంగువ, మట్కా సినిమాలు వస్తుండటంతో దీని జోరు కాస్త తగ్గే అవకాశం కనిపిస్తుంది.




