Daggubati Venkatesh : ఆ 100 రోజులు పాజటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి.. వెంకటేష్ ఆసక్తికర కామెంట్స్
సమ్మర్ సోగ్గాళ్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు వెంకటేష్, వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 3 సినిమా ఈ నెల 27న విడుదల అయ్యింది.

సమ్మర్ సోగ్గాళ్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు వెంకటేష్(Daggubati Venkatesh ), వరుణ్ తేజ్(Varun Tej ). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్ 3 సినిమా ఈ నెల 27న విడుదల అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో మరింత ఫన్ ను జోడించారు దర్శకుడు అనిల్. అలాగే వెంకీ, వరుణ్ తో కలిసి సునీల్ కూడా కడుపుబ్బా నవ్వించారు. మొత్తంగా సమ్మర్ సూపర్ హిట్ గా నిలిచింది ఎఫ్3 సినిమా. ఎఫ్3 మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. తన సంతోషాన్ని పంచుకున్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ..నాకు నిజంగా చాలా సంతోషంగా వుంది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను అన్నారు వెంకటేష్. మాకు బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. మీరిచ్చిన ఈ విజయం గురించి నేను మాటల్లో చెప్పలేను. ఈ సినిమా షూటింగ్ జరిగిన 100 రోజుల్లోనూ పాజటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. ప్రతీ సీన్ చేసేటప్పుడు ఎంకరేజ్ మెంట్ వండర్‌ఫుల్ అనుభవం. అలాంటిదే ప్రేక్షకులు ఇచ్చారు. రియల్ టీమ్ వర్క్ ఇది. ఎఫ్2 తర్వాత ఎఫ్3 చేశారంటే ప్రతి ఒక్కరూ సొంత సినిమాగా భావించి చేశారు. ప్రేక్షకులు.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు వస్తున్నారు. వెరీవెరీ హ్యాపీ. నా అభిమానులు థియేటర్ లో నన్ను చూసి మూడేళ్ళయింది. నా సినిమా చూసి మనస్పూర్తిగా అభినందిస్తున్న ఇండస్ట్రీలోనివారికి థ్యాంక్స్ చెబుతున్నా. నాకు చాలా కాల్స్ వచ్చాయి. అందరికీ వెరీవెరీ థ్యాంక్స్ అన్నారు వెంకటేష్.



