Sudheer Babu: మామ పుట్టిన రోజున కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన యంగ్ హీరో
సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు సినిమా చరిత్రలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఆయన సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ(Superstar Krishna).. తెలుగు సినిమా చరిత్రలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఆయన సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. తేనెమనసులు సినిమాతో పరిచయం అయ్యి.. ఆ తర్వాత 500లకు పైగా సినిమాల్లో నటించి సూపర్ స్టార్ గా ఎదిగారు. కృష్ణ హాలీవుడ్ పాత్రలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. తెలుగు చిత్రపరిశ్రమలో అప్పుడప్పుడే హైటెక్నాలజీ అప్డేట్ అవుతున్న సమయంలో సాంకేతిక టెక్నాలజీని జోడిస్తూ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. నేడు ఆయన పుట్టిన రోజు. నేటితో 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. సుధీర్ బాబు కృష్ణ అల్లుడు అన్న విషయం తెలిసిందే.. రీసెంట్ గా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో హిట్ కొట్టిన సుధీర్ బాబు. ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
సూపర్ స్టార్ కృష్ణకు సుధీర్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. తన తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి ఆకట్టుకున్నాడు సుధీర్ బాబు. షర్ట్ లేకుండా సుధీర్ బాబు వర్కవుట్స్ చేసిన విన్యాసాలు.. అలాగే డ్యాన్స్ మూమెంట్స్ కూడా చూపించారు. ఇక ఈ సినిమాకు చేతన్ భరద్వాజ సంగీతం అందించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై నారాయణ దాస్ నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
View this post on Instagram



