Veerasimhareddy: బాలయ్య ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. వీర సింహారెడ్డి నుంచి మరో సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల రిలీజ్ అయిన జై బాలయ్య మాస్ ఆంథేమ్ సాంగ్ నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుంది. ఇప్పటికే ప్రతి ప్రమోషన్ మెటీరియల్ కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న చిత్రం వీరసింహారెడ్డి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే . ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల రిలీజ్ అయిన జై బాలయ్య మాస్ ఆంథేమ్ సాంగ్ నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుంది. ఇప్పటికే ప్రతి ప్రమోషన్ మెటీరియల్ కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎస్ థమన్ సంగీతం అందించిన ‘జై బాలయ్య‘ ఫస్ట్ సింగిల్ కూడా చార్ట్‌బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా, ఒక్క పాట మాత్రమే షూటింగ్ కి మిగిలి ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు మే కర్స్. తాజాగా సెకండ్ సింగిల్ సుగణ సుందరి సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాలోని రెండో సాంగ్ సుగుణ సుందరిని డిసెంబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. వీరసింహా రెడ్డి జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో బాలయ్య మాస్ ఎనర్జీని చూసి ఎంజాయ్ చేయండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ఈ పాటను టర్కీలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.
#VeeraSimhaReddy second single #SugunaSundari out on 15th Dec ?
Watch out for Balayya’s MASS energy in this one ❤️?
Grand Release on 12th Jan, 2023 ?#NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/vVCf7nSW8w
— Mythri Movie Makers (@MythriOfficial) December 11, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.