vamshi paidipally : నేను కథలను రాయలేను.. అందుకే నా సినిమాలు ఆలస్యం అవుతాయి.. ఆసక్తికర విషయాలు తెలిపిన వంశీ పైడిపల్లి
తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో వంశీ పైడిపల్లి ఒకరు. ప్రభాస్ నటించిన మున్నా సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు వంశీ.
vamshi paidipally : తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్స్ లో వంశీ పైడిపల్లి ఒకరు. ప్రభాస్ నటించిన మున్నా సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు వంశీ. ఇక వరుసగా విజయవంతమైన సినిమాలను తెరకెక్కించి టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా దక్కింది. అయితే వంశీ సినిమా అంనౌన్స్ చేయడానికి చాలా సమయం తీసుకుంటుంటారు. ‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆయన, ఇంతవరకూ మరో ప్రాజెక్టునుమొదలు పెట్టలేదు. సినిమా సినిమాకు చాలా గ్యాప్ ఉంటుంది. అందుకు కారణం అన్న ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తాయి. తాజాగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు వంశీ.
ఇటీవల ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. వంశీ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. “నేను స్వతహాగా కథలు రాసుకోలేను .. కథల కోసం రచయితలను ఆశ్రయిస్తాను అన్నారు. అలాగే కథలో మార్పులు చేయించవలసి వచ్చినప్పుడు, రచయితలను పట్టుకుని వారితో ఆ పనిని చేయిస్తూ ఉంటాను అందువలన సినిమాలు ఆలస్యమవుతుంటాయి. ఇక ఇప్పుడు ఆ సమస్య రాకూడదనే ముందుగానే కథలను రెడీ చేసిపెట్టుకుంటాను” అంటూ వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు. వంశీ ప్రస్తుతం తమిళ్ హీరో దళపతి విజయ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ కోసం ఓ అద్భుతమైన కథను కూడా సిద్ధం చేశారట వంశీ. అలాగే విజయ్ సినిమాతర్వాత మహేష్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు వంశీ .
మరిన్ని ఇక్కడ చదవండి :