Ajith Kumar : అజిత్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. దీపావళికి ప్లాన్ చేస్తున్న మేకర్స్..

తమిళ్ స్టార్ హీరోల్లో అజిత్ కు ప్రత్యేక క్రేజ్ ఉంది. తమిళనాట అజిత్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. 

Ajith Kumar : అజిత్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. దీపావళికి ప్లాన్ చేస్తున్న మేకర్స్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 01, 2021 | 8:14 AM

Ajith Kumar : తమిళ్ స్టార్ హీరోల్లో అజిత్ కు ప్రత్యేక క్రేజ్ ఉంది. తమిళనాట అజిత్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.  అజిత్ సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అవుతూ ఉంటాయి. తెలుగులో అజిత్ కు మంచి మార్కెట్ ఉంది. 50 యేళ్లకు చేరువవుతున్నా.. వరుస సినిమాలతో ఫ్యాన్స్ లో ఫుల్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో.. అజిత్. కథ నచ్చితే చాలు.. జెట్ స్పీడ్ తో చిత్రాలు చేస్తుంటాడు. అలాంటి అజిత్.. హిట్ ఇచ్చిన డైరెక్టర్లకు మరిన్ని ఆఫర్లు ఇస్తుంటాడు కూడా. డైరెక్టర్ శివతో ఏకంగా నాలుగు సినిమాలు చేసిన అజిత్.. ప్రస్తుతం వినోద్ తో ‘వాలిమై’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తూ ఉండగా, కార్తికేయ విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదల కోసం అజిత్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో నీర్కెండ పార్త్వే అనే మూవీ వచ్చింది. ఇది హిందీ పింక్ మూవీకి రీమేక్. ఇది బాగా ఆడటంతో.. నెక్ట్స్ వీరిద్దరి కాంబినేషన్‌లో వాలిమై వస్తోంది. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది.

ఇక వాలిమై సినిమాను ‘దీపావళి’ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కోలీవుడ్ వినిపిస్తుంది. అజిత్ సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్ ను ఆయన అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. ‘వాలిమై’ యాక్షన్ థ్రిల్లర్ కావడం వాళ్లలో మరింత ఆసక్తిని పెంచుతోంది. కొంతకాలంగా అజిత్ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Juhi Chawla: దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా కోర్టు మెట్లక్కిన నటి జుహీ చావ్లా..

అర్ధరాత్రి నా కారును నలుగురు దుండగులు వెంబడించారు.. అది చాలా భయంకరమైన రోజు.. చేదు అనుభవాన్ని చెప్పిన నటి..

బిగ్‏బాస్‏లోకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ ?.. కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ చేస్తోన్న నిర్వాహకులు.. ఎవరెవరంటే.