Tamannaah : ఓటీటీ స్టార్ గా రాణిస్తున్న మిల్కీబ్యూటీ.. త్వరలో టాక్ షోతో రానున్న తమన్నా..
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా.. ఆతర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ...
Tamannaah : సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా.. ఆతర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించింది ఈ బ్యూటీ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది తమన్నా. ఇటీవల తమన్నా ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ వరకు ఆకట్టుకున్నా వెబ్ సిరీస్ విడుదలయ్యాక మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
తమన్నాలాంటి స్టార్ హీరోయిన్ వెబ్ సిరీస్ కావడంతో ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది. కానీ వెబ్ సిరీస్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆహా బృందం మాత్రం పాజిటివ్ గానే ముందుకు సాగుతుంది. అయితే ఇటీవలే నవంబర్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ చేసింది. తమన్నా గ్లామర్ బ్యూటీ కాబట్టి ఆమెతో ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుందట ఓటిటి. ఫెయిల్యూర్స్ గురించి తాను పట్టించుకోను అంటోంది అమ్మడు. తమన్నా ఓటిటిలో అదిరిపోయే యాక్షన్ ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఓ టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది తమన్నా. ఇలా ఈ అమ్మడు ఇప్పుడు ఓటీటీ స్టార్ గా రాణించాలని ప్రయత్నాలు చేస్తుంది. మరో వైపు వెంకటేష్ వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్ 3 సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. గతంలో వచ్చిన ఎఫ్ 2 కు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి.
మరిన్ని ఇక్కడ చదవండి :