AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucifer Movie: మెగాస్టార్ ‘లూసిఫర్’ మూవీ అప్‏డేట్.. పోస్టర్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. అసలు విషయం ఎంటంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ

Lucifer Movie: మెగాస్టార్ 'లూసిఫర్' మూవీ అప్‏డేట్.. పోస్టర్‏తో రూమర్స్‏కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. అసలు విషయం ఎంటంటే..
Lucifer
Rajitha Chanti
|

Updated on: May 31, 2021 | 10:07 PM

Share

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మెగాస్టార్.. రీమేక్ చిత్రాలను చేయనున్నారు. అయితే ఇందులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు లూసిఫర్ రీమేక్ మాత్రమే. అయితే ఈ సినిమా గురించి చాలా రోజులుగా అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఈ సినిమా ఉంటుందా ? లేదా ? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ ఆ రూమర్స్ అన్నింటికి క్లారిటీ ఇచ్చేసింది.

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ అల్టిమేట్ హిట్.. లూసీఫర్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ.. మాతృకలో భారీ హిట్ సాధించింది. చాలా భాషల్లో డబ్ అయ్యింది. అయితే ఈ మూవీపై మెగాస్టార్ చిరంజీవి మనస్సు పారేసుకున్నారు. రీమేక్ రైట్స్ కూడా కొనేశారు. దీంతో ఈ మూవీపై టాలీవుడ్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే అప్పటి నుంచి అందరి మదిలో ఒకటే క్వశ్చన్. మెగాస్టార్ ను డీల్ చేసే డైరెక్టర్ ఎవరనేదే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

రాజు మరణించాక అరాచక శక్తుల చేతిలోకి వెళ్లిన సామ్రాజ్యాన్ని.. తిరిగి దక్కించుకునే క్రమంలో జరిగిన పోరాటమే లూసీఫర్. ఇలాంటి కథను మెగాస్టార్ హీరోగా తీయడం అంటే మాటలు కాదు. ముందుగా ఈ సినిమాకు సాహో డైరెక్టర్ సుజిత్ ను అప్పగించాలని అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత రీమేక్ స్పెషలిస్ట్.. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా పేరు తెరపైకి వచ్చింది. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే రూమర్.. సినీ సర్కిల్ లో వైరల్ అయ్యింది. చివరకు ఇవాళ కొణిదెల సంస్థ.. ఓ ట్వీట్ చేసింది. మోహన్ రాజా బర్త్ డే సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ.. ఓ ఫోటోను విడుదల చేసింది. కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందని తెలిపింది. ఇటు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా బర్త్ డే విషెష్ చెబుతూ.. లూసీఫర్ మూవీని ఎలా చెక్కుతున్నారో తనకు తెలుసంటూ ట్వీట్ పేర్కొన్నాడు. దీంతో లూసిఫర్ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి రానున్నట్లు.. కన్ఫర్మ్ అయ్యింది.

Also Read: బిగ్‏బాస్‏లోకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ ?.. కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ చేస్తోన్న నిర్వాహకులు.. ఎవరెవరంటే..