Prabhas: యంగ్ రెబల్ స్టార్ కోసం మరో బాలీవుడ్ డైరెక్టర్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో ప్రభాస్ పాత్ర అదేనా..

Prabhas New Movie:  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దృష్టి ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా ప్రాజెక్టులపైనే పడింది. ప్రస్తుతం ప్రభాస్

Prabhas: యంగ్ రెబల్ స్టార్ కోసం మరో బాలీవుడ్ డైరెక్టర్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‏లో ప్రభాస్ పాత్ర అదేనా..
Prabhas 1
Follow us
Rajitha Chanti

|

Updated on: May 31, 2021 | 10:23 PM

Prabhas New Movie:  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దృష్టి ఇప్పుడు పూర్తిగా పాన్ ఇండియా ప్రాజెక్టులపైనే పడింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి బారీ బడ్జెట్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండగా.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రాబోయే పాన్ వరల్డ్ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే ప్రభాస్ కోసం ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. ఇప్పటికే రెబల్ స్టార్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలో నటిస్తుండగా.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కు కరోనా కళ్లెం వేసింది. దీంతో తాత్కలికంగా ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది. Siddharth Anand

అయితే ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి మరో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కూడా వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం. భారీ యాక్షన్ చిత్రాలను నిర్మించే సిద్ధార్థ్ ఆనంద్.. ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అంతేకాకుండా.. ఈ మూవీలో ప్రభాస్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబోకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Smoking Corona: మీరు స్మోక్ చేస్తారా.? వెంట‌నే మానేయండి.. క‌రోనా స‌మయంలో ఇది చాలా డేంజ‌ర్‌.. మ‌ర‌ణం సంభవించే ఛాన్స్‌..

Increased Egg Prices : కొండెక్కిన గుడ్డు ధర..! ఒక్కోటి 6 నుంచి 8 రూపాయలు..? ఎగ్ రేట్లు ఎందుకు పెరిగాయో తెలుసుకోండి..

TS Medical Colleges : రాష్ట్రంలో ఏడు మెడికల్ కాలేజీలు , వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Helplines : నాలుగు హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం, ప్రజలకు తెలియ పర్చాలని టీవీ ఛానళ్లకు వినతి