TS Medical Colleges : రాష్ట్రంలో ఏడు మెడికల్ కాలేజీలు , వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్ కొత్తగూడెంలలో 7 మెడికల్ కాలేజీలు , వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను..

TS Medical Colleges : రాష్ట్రంలో ఏడు మెడికల్ కాలేజీలు , వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
Cm Kcr
Follow us
Venkata Narayana

|

Updated on: May 31, 2021 | 1:44 AM

Telangana medical colleges and nursing colleges : రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై తెలంగాణ మంత్రివర్గం చర్చించింది. కరోనా వ్యాప్తి తీరు, బాధితులకు అందుతున్నవైద్యం, నియంత్రణ కోసం వైద్య శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించింది. కాగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నదని వైద్య శాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా వున్న ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఆలంపూర్, గద్వాల, నారాయణ్ పేట్, మక్తల్, నాగార్జున సాగర్, కోదాడ, హుజూర్ నగర్ వంటి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో హెల్త్ సెక్రటరీ తోపాటు రాష్ట్రస్థాయి వైద్యాధికారులు పర్యటించాలని, సమీక్ష చేసి కరోనా నియంత్రణకు తగు చర్యలను తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, థర్డ్ వేవ్ వస్తుందనే వార్తల పట్ల వైద్య శాఖ పూర్తి అప్రమత్తతతో ఉండాలని, సంబంధిత నియంత్రిత ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని ఏరియా, జిల్లా, తదితర దవాఖానల పరిస్తితుల మీద రివ్యూ చేయాలని, అన్నిరకాల మౌలిక వసతులను కల్పనకు చర్యలు తీసుకోవాలని వైద్యశాఖను ఆదేశించింది.

రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్ కొత్తగూడెంలలో 7 మెడికల్ కాలేజీలు , వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికే మంజూరయి వున్న వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా కేబినెట్ మంజూరు చేసింది. వరంగల్ లో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణాన్ని, ప్రస్థుతం జైలు వున్న ప్రాంగణంలో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. జైలులో ప్రస్థుతం వున్న ఖైదీలను అనువైన ఇతర ప్రాంతానికి తరలించాలని, జైలు స్థలాన్ని నెలలోపు వైద్యశాఖకు అప్పగించాలని, హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది. మామునూరులో విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకుని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జైలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నిర్మాణ ప్రతిపాదనలను సిద్దం చేయాలని తర్వాతి కేబినెట్ కు తీసుకురావాలని హోం శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.

Read also : Helplines : నాలుగు హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం, ప్రజలకు తెలియ పర్చాలని టీవీ ఛానళ్లకు వినతి