Helplines : నాలుగు హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం, ప్రజలకు తెలియ పర్చాలని టీవీ ఛానళ్లకు వినతి
> 1075 - నేషనల్ హెల్ప్‌లైన్ (కేంద్ర ఆరోగ్యశాఖ), > 1098 - చైల్డ్ హెల్ప్‌లైన్ (మిహిళా శిశు అభివృద్ధి శాఖ), > 14567 - సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్
Four new helpline numbers : కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుండటం .. తదనంతర పరిణామాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దేశవాసులకు సహాయం చేసే నిమిత్తం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. నేషనల్ హెల్ప్‌లైన్, చైల్డ్ హెల్ప్‌లైన్, సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్ నెంబర్లను దేశవాసులకు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఏర్పాటుచేసిన హెల్ప్ లైన్ నెంబర్లకు ప్రచారం కల్పించాల్సిందిగా దేశంలోని అన్ని ప్రయివేటు టీవీ ఛానళ్లను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సర్కులర్ జారీచేసింది. ఈ మేరకు ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం.. హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రైమ్ టైమ్‌లో స్క్రోల్ చేయాల్సిందిగా సూచించింది. కాగా, దేశ పౌరులు కేంద్ర సహాయ సహకారాల కోసం చేయాల్సిన ఉచిత హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు ఈ విధంగా ఉన్నాయి.
> 1075 – నేషనల్ హెల్ప్‌లైన్ (కేంద్ర ఆరోగ్యశాఖ)
> 1098 – చైల్డ్ హెల్ప్‌లైన్ (మిహిళా శిశు అభివృద్ధి శాఖ)
> 14567 – సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్ (సామాజిక న్యాయశాఖ) (ఢిల్లీ, కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో)
Read also : Bhumana : భూమన మానవత్వం.. ముస్లిం యువతతో కలిసి మతాలకతీతంగా ఇప్పటి వరకూ 500 మందికి పైగా దహన సంస్కారాలు