AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం చావు తెలివి తేటలు బాబోయ్.. అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని డ్రామా! సీన్‌ కట్‌ చేస్తే..

మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఒక వ్యక్తి, పోలీసుల అరెస్టు నుండి తప్పించుకునేందుకు ఏకంగా తాను చనిపోయినట్లు నమ్మించే వినూత్న నాటకానికి తెరతీశాడు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో, బతికున్న అతను తన అంత్యక్రియలను తానే నిర్వహించుకుని, పోలీసులే నివ్వెరపోయేలా చేశాడు. సీన్‌ కట్‌ చేస్తే ఖాకీలకు అడ్డంగా దొరికిపోయాడు.. చివరకు జరిగింది తెలిస్తే మీరు సైతం నోరెళ్ల బెట్టాల్సిందే..ఈ విచిత్ర ఘటనా దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఏం చావు తెలివి తేటలు బాబోయ్.. అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని డ్రామా! సీన్‌ కట్‌ చేస్తే..
Fake Death
Jyothi Gadda
|

Updated on: Jul 22, 2026 | 4:39 PM

Share

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చిక్కినప్పుడు కొంతమంది పోలీసులు చెప్పిన జరిమానా కట్టి తప్పించుకుంటారు. మరికొందరు తప్పించుకోవడానికి రకరకాల సాకులు చెబుతారు. కానీ, చైనాలోని ఒక వ్యక్తి ఏకంగా పోలీసుల కళ్లు కప్పడానికి తనే చనిపోయినట్లు నమ్మించి పెద్ద వింత నాటకమే ఆడేశాడు. అరెస్టు కాకుండా ఉండేందుకు శవపేటికలో పడుకుని, బంధువులతో కలిసి నకిలీ అంత్యక్రియల ఊరేగింపు కూడా నిర్వహించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఒక వ్యక్తి జైలు శిక్ష నుండి తప్పించుకోవడానికి సృష్టించిన భయంకరమైన, వింత నాటకం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. మద్యం సేవించి వాహనం నడిపే వారు పోలీసుల నుండి తప్పించుకోవడానికి రకరకాల సాకులు చెబుతుంటారు, కానీ ఈ వ్యక్తి చేసింది మాత్రం నెక్ట్స్‌ లెవల్‌ అని చెప్పాలి. చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌లో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో పట్టుబడిన ఒక వ్యక్తి అరెస్టు నుండి తప్పించుకోవడానికి తనను తాను చనిపోయినట్టుగా డ్రామా క్రియేట్‌ చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి శవపేటికను తానే కొనుక్కుని… ఇంట్లో ఖాళీ మందుల సీసాలను చెల్లాచెదురుగా పడేసి, ఆ తర్వాత తాను చనిపోయానని ప్రకటించుకుని పారిపోయాడు.

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన సీ అనే వ్యక్తి ఇటీవల మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు. మద్యం మత్తు మోతాదుకు మించి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తీవ్రమైన జైలు శిక్ష లేదా లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉందని భయపడిన సీ, అరెస్టు కాకుండా ఉండేందుకు ఒక విచిత్రమైన పథకం వేశాడు. తక్షణమే తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో ఒక శవపేటికను కొనుగోలు చేశాడు. తను హఠాత్తుగా చనిపోయాడని ప్రపంచాన్ని నమ్మించేందుకు, తాను స్వయంగా ఆ శవపేటికలో పడుకున్నాడు.

ఇవి కూడా చదవండి

అయితే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి, శవపేటిక అప్పటికే పూడ్చిపెట్టబడిందని తెలిసింది. కానీ, వైద్య నివేదిక లేదా ఎటువంటి మరణ ధృవీకరణ పత్రం లేకపోవడంతో పలు అంశాలు వెంటనే అనుమానాన్ని రేకెత్తించాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, బ్యాంకు రికార్డులను పరిశీలించగా అసలు నిజం బయటపడింది. యునాన్ ప్రావిన్స్‌లో సజీవంగా ఉన్న ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అతనికి ఐదు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించినందుకు సి తల్లి, అమ్మమ్మలపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ విచిత్ర సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు అతడి తెలివితేటలపై తీవ్రంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్
RRR రికార్డ్‌ బద్దలు..కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్
తండ్రి కాబోతున్న జబర్దస్త్ ప్రవీణ్.. బ్యూటిఫుల్ వీడియోతో..
తండ్రి కాబోతున్న జబర్దస్త్ ప్రవీణ్.. బ్యూటిఫుల్ వీడియోతో..
విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్‌ లోను ఉంటే ఎవరు కట్టాలి?
విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో.. హోమ్‌ లోను ఉంటే ఎవరు కట్టాలి?
Video: వావ్.. 5శాతం నీటితో మేడపై 70శాతం కూరగాయల సాగు..
Video: వావ్.. 5శాతం నీటితో మేడపై 70శాతం కూరగాయల సాగు..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై వెహికల్స్‌పై ఇవి ఉంటే జరిమానే
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై వెహికల్స్‌పై ఇవి ఉంటే జరిమానే
ఫైనల్‌కి దూసుకెళ్లిన వైభవ్ టీమ్..!
ఫైనల్‌కి దూసుకెళ్లిన వైభవ్ టీమ్..!