AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ వ్యాధికి అతిపెద్ద శత్రువు ఈ మొక్క.. డయాబెటిస్‌కు చెక్ పెట్టే ప్రకృతి వరప్రసాదం..!

మధుమేహం నిర్మూలనలో ఇన్సులిన్ మొక్క ఒక తిరుగులేని ప్రకృతి ప్రసాదించిన ఔషధంగా ప్రాచుర్యం పొందింది. ఈ మొక్క ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు క్లోమగ్రంథిలోని బీటా కణాలను ప్రేరేపించి, శరీరంలో సహజసిద్ధంగా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక పచ్చి ఆకును నమిలి తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు క్రమబద్ధీకరించబడతాయి. అంతేకాకుండా, ఈ ఇన్సులిన్‌ మొక్క వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

షుగర్ వ్యాధికి అతిపెద్ద శత్రువు ఈ మొక్క.. డయాబెటిస్‌కు చెక్ పెట్టే ప్రకృతి వరప్రసాదం..!
Insulin Plant
Jyothi Gadda
|

Updated on: Jul 21, 2026 | 8:45 PM

Share

నేటి ఆధునిక జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా మధుమేహం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. జీవితాంతం మందులు వాడాల్సి రావడం వల్ల చాలామంది ప్రత్యామ్నాయ ఆయుర్వేద, ప్రకృతి వైద్య విధానాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మధుమేహ బాధితులకు ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేసేదే ఇన్సులిన్ మొక్క. ఈ మొక్క ఆకులలో కోరోసోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్లు, ప్రోటీన్లు, పలు రకాల యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

ఈ ఆకులను నమిలి తిన్నప్పుడు, లోపలి పోషకాలు క్లోమగ్రంథిని ప్రేరేపించి బీటా కణాల ద్వారా ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతాయి. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా ఇది నిరోధిస్తుంది.

ఇన్సులిన్ ఆకును ఎలా ఉపయోగించాలి?:

ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక లేత ఇన్సులిన్ ఆకును బాగా నమిలి మింగాలి. ఆకులను నీడలో బాగా ఎండబెట్టి పొడి చేసి, అర టీస్పూన్ పొడిని గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇతర ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు:

ఈ ఆకులలో ఉండే పీచు పదార్థం, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపులో పూతలు రాకుండా కాపాడతాయి. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే డిటాక్సిఫైయర్‌గా పనిచేసి, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణనిస్తుంది.

డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు కెమికల్స్ ఉన్న మందులపై ఆధారపడటంతో పాటు ఈ సహజ సిద్ధమైన ఇన్సులిన్ ఆకును ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. అయితే, ఆల్రెడీ ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేదా తీవ్రమైన షుగర్ మందులు వాడుతున్నవారు ఈ ఆకులను ప్రారంభించే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు!
జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి
జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి
సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు..
సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు..
భాద్రపద పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ఐశ్వర్యం
భాద్రపద పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ఐశ్వర్యం
మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో..
మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో..
రాజయోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్! ధనం, ఉద్యోగంలో..
రాజయోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్! ధనం, ఉద్యోగంలో..
కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి
కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి
అయ్యప్ప సన్నిధిలో అపచారం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!
అయ్యప్ప సన్నిధిలో అపచారం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!
IPL 2027 వేలం ఇండియాలోనే.. గోవాలో మినీ ఆక్షన్‌!
IPL 2027 వేలం ఇండియాలోనే.. గోవాలో మినీ ఆక్షన్‌!