AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vengal Rao- Vadivelu: ప్రముఖ కమెడియన్‌కు పక్షవాతం.. ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వడివేలు

ప్రముఖ కమెడియన్‌ వెంగళ్రావు ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన పరిస్థితి మరింత దిగజారింది. పక్షవాతం కారణంగా ఒక చేయి, కాలు పడిపోయింది. కనీసం కదల్లేని స్థితిలో ఉన్నారు

Vengal Rao- Vadivelu: ప్రముఖ కమెడియన్‌కు పక్షవాతం.. ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వడివేలు
Vengal Rao, Vadivelu
Basha Shek
|

Updated on: Jun 29, 2024 | 4:15 PM

Share

ప్రముఖ కమెడియన్‌ వెంగళ్రావు ప్రస్తుతం దీన స్థితిలో ఉన్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన పరిస్థితి మరింత దిగజారింది. పక్షవాతం కారణంగా ఒక చేయి, కాలు పడిపోయింది. కనీసం కదల్లేని స్థితిలో ఉన్నారు. దీంతో చికిత్సకు సైతం డబ్బుల్లేవంటూ, తనను ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో రీలీజ్ చేశారు. దీనిని చూసిన స్టార్ హీరో శింబు వెంటనే స్పందించాడు. వెంగళ్ రావు వైద్య ఖర్చుల నిమిత్తం వెంటనే రూ. 2లక్షల ఆర్థిక సాయం అందించాడు. ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ తన వంతుగా రూ. 25,000 ఆర్థిక సాయం చేసింది. తాజాగా వెంగళరావుతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన మరో పాపులర్ కమెడియన్ వడివేలు తన తోటి కమెడియన్ ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. చికిత్స ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు అందజేసిన వడివేలు త్వరలోనే వెంగళరావను కలవనున్నారట. ఆయన యోగక్షమాలు తెలుసుకోనున్నారట.

ఆంధ్రప్రదేశలోని విజయవాడ కు చెందిన వెంగళ్ రావు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్థిర పడ్డారు. కెరీర్ ప్రారంభంలో స్టంట్‌మెన్‌గా పని చేశారు. ఆ తర్వాత నటుడిగా మారారు. కాంతస్వామి, తలై నగరం, పగిరి.. ఇలా పలు హిట్ సినిమాల్లో నటించారు. తన కెరీర్ లో ఎక్కువగా వడివేలుతోనే కలిసి నటించరీ కమెడియన్. వీరిద్దరి కాంబినేషన్ లోనే దాదాపు 30కు పైగా సినిమాలున్నాయి. అయితే వడివేలుపై నిషేధం విధించిన తర్వాత వెంగళ రావుకు సినిమా అవకాశాలు అడుగంటాయి. దీనికి తోడు ఆర్థిక సమస్యలు ఆయనను చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆయన విజయవాడలోనే నివాసముంటున్నారు

ఇవి కూడా చదవండి

సాయం చేయాలంటూ ఆర్థిస్తోన్న వెంగళ రావు.. వీడియో

రూ. 2 లక్షలు ఇచ్చిన శింబు..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..